Begin typing your search above and press return to search.

దీపావళికి మాంత్రికుడిపై పవన్ ప్రకటన?

By:  Tupaki Desk   |   20 Oct 2016 3:05 PM IST
దీపావళికి మాంత్రికుడిపై పవన్ ప్రకటన?
X
దసరా పండగ అయిపోయింది.. పండుగ సందర్భంగా పలు క్రేజీ ప్రాజెక్టులు విడుదలైతే.. రాబోయే సినిమాలకు సంబంధించిన లుక్స్.. టీజర్స్ సందడి చేశాయి. ఇప్పుడు దీపావళి రాబోతోంది. దసరా నాడు ఫ్యాన్స్ ను పలకరించడం మిస్ అయిన స్టార్లంతా దీపావళిపై కన్నేశారు. ఆ రోజున తమ అభిమానులకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు.

ఇలా తన ఫ్యాన్స్ ను పలకరించేదుకు రెడీ అవుతున్నవారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడట. నిజానికి పవన్ కళ్యాణ్ జోరు బాగానే ఉంది కానీ.. మరో వారంలో రానున్న పండుగ నాటికి టీజర్ లాంటివేమీ ఇచ్చేంతగా కాటమరాయుడు పనులు జరగలేదు. దీంతో కొత్త ప్రాజెక్టు గురించిన అనౌన్స్ మెంట్ ఇచ్చి.. ఫ్యాన్స్ ను ఖుషీ చేయనున్నాడట పవన్. అదేంటో కాదు.. పవర్ స్టార్ తో మాటల మాంత్రికుడు తీయనున్న మూడో సినిమా గురించే. ఈ కాంబోపై కొన్నాళ్లుగా రకరకాల వార్తలొస్తున్నాయి.

ఉందని.. లేదని.. క్యాన్సిల్ అయిందని.. పోస్ట్ పోన్ అయిందని.. లాంటి న్యూస్ కి ఒకే ఒక్క ప్రకటనతో చెక్ పెట్టేయాలని డిసైడ్ అయ్యాడట పవన్. ఆ సంగతిని ముందుగా చెప్పేబదులు పండుగ రోజున అనౌన్స్ చేస్తే.. ఫ్యాన్స్ కి రెండు పండుగలు వచ్చినట్లు అవుతుందన్నది పవన్ సన్నిహితుల యోచనగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/