Begin typing your search above and press return to search.
PSPK-త్రివిక్రమ్ `కోబలి`.. మళ్లీ తెరపైకి సీమ ఫ్యాక్షన్?
By: Tupaki Desk | 4 Sept 2020 10:45 AM ISTరాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. బొమ్మ బ్లాక్ బస్టర్!! అని చెప్పుకున్నవే వీటిలో ఎక్కువ. ఎన్టీఆర్ హీరోగా `అరవింద సమేత వీర రాఘవ` ఫ్యాక్షన్ నేపథ్యంలో విలక్షణమైన ఎంపిక. అది త్రివిక్రమ్ స్టైల్ నేరేషన్ తో తెలుగు ఆడియెన్ ని ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి సీమ ఫ్యాక్షన్.. గ్రామీణ నేపథ్యంలో మరో సినిమాకి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారా? అందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది చాలా సంవత్సరాలుగా అనుకుంటున్న ప్రాజెక్ట్. కానీ ఎందుకనో రకరకాల కారణాలతో ఆలస్యమైంది. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో `కోబలి` అనే చిత్రాన్ని అప్పట్లో ప్రకటించారు. ఈ చిత్రం రాయలసీమ వర్గం నేపథ్యంలో గ్రామీణ నేపథ్యంలో ఉంటుందన్న చర్చా సాగింది. అయితే అప్పట్లో ప్రకటన వచ్చినా ఇప్పటి వరకూ ఈ జోడీ కలిసి పని చేసేందుకు కుదరనే లేదు.
తాజా సమాచారం ప్రకారం... కోబలి చిత్రాన్ని ఇంకా వదిలి పెట్టలేదట. పవన్ కాల్షీట్లు చూసుకుని త్రివిక్రమ్ పక్కాగా ప్లాన్ చేయాలని భావిస్తున్నారట. అయితే పవన్ షెడ్యూల్స్ చూస్తే ఇప్పటికే నాలుగు సినిమాలకు కమిటయ్యారు. రాబోయే రెండు సంవత్సరాలు అతడు త్రివిక్రమ్ కి దొరకడం కష్టమేనని అంచనా వేస్తున్నారు. అయినా మాటల మాంత్రికుడు తన స్నేహితుడు పవన్ ని ఒప్పించే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్నిటికి కాలమే సమాధానం చెబుతుందేమో చూడాలి.