Begin typing your search above and press return to search.
బాబాయి అబ్బాయి రేర్ పిక్ వైరల్
By: Tupaki Desk | 31 May 2023 1:00 PMఈ మధ్య కాలంలో స్టార్ హీరోల ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఒకప్పటి ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తే అవి వైరల్ అవ్వడం చాలా కామన్ విషయం. తాజాగా బాబాయి అబ్బాయి పవన్ - చరణ్ ల పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ లు కలిసి ఉన్న ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫోటోను చూస్తూ ఉంటే చరణ్ ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టినట్లుగా లేడు. ఇక పవన్ కళ్యాణ్ చాలా కూల్ అండ్ సింపుల్ లుక్ లో కనిపిస్తున్నాడు.
జానీ సినిమా టైమ్ లో పవన్ కళ్యాణ్ ఇలాగే ఉండేవాడు. కనుక పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా యొక్క షూటింగ్ సమయంలో ఈ ఫోటో తీసి ఉంటారు అంటూ కొందరు అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఎప్పటి ఫోటో అనేది మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి బాబాయి.. అబ్బాయిని సింగిల్ ఫ్రేమ్ లో చూడటం చాలా బాగుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పవన్.. చరణ్ ల సినిమాల విషయానికి వస్తే.. పవన్ జులై లో 'బ్రో' సినిమా తో రాబోతున్నాడు. ఇదే ఏడాది సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.
ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా లో నటిస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. మరో వైపు నిర్మాతగా కూడా వరుస సినిమాలు నిర్మించేందుకు స్నేహితుడు విక్రమ్ తో కలిసి వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ను మొదలు పెట్టాడు.