Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ నే రెచ్చగొడుతోంది

By:  Tupaki Desk   |   13 March 2016 11:17 AM GMT
పవర్ స్టార్ నే రెచ్చగొడుతోంది
X
‘గబ్బర్ సింగ్’ ఎంత రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడో తెలిసిందే కదా. భాగ్యలక్ష్మి తప్ప ఇంకే అమ్మాయి కవ్వించినా అస్సలు పట్టించుకోడు. ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మాత్రం తక్కువైనోడా? గబ్బర్ సింగ్ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివి ఉంటాడు. మరి అలాంటోడిని కదిలించాలంటే మామూలు అమ్మాయిల వల్ల సాధ్యమవుతుందా? అందుకే చెన్నై నుంచి పిల్ల దిగింది. జానెడు రైక తగిలించుకుని.. మోకాలి దాకా లంగా వేసుకని.. అదిరిపోయే అందాలతో దిగిపోయింది. నేరుగా సర్దార్ బాబుకి మల్లెపూల మాలతో వల విసిరింది. మరి ఈ పిల్ల అందాలకు సర్దార్ పడిపోయాడో లేదో ఏప్రిల్ 8వ తారీఖున తెలుసుకోండి.

నిన్న రిలీజైన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మేకింగ్ వీడియోల్లో ప్రతి షాట్ అభిమానుల్ని ఉర్రూతలూగించింది. అందులో కుర్రాళ్ల మతిపోగొట్టే దృశ్యం కూడా ఒకటుందండోయ్. ఇందులో ఐటెం సాంగ్ చేస్తున్న రాయ్ లక్ష్మీ మత్తెక్కించే అవతారంలో నిలబడి ఉంటే.. తన చేతుల్లోంచి మల్లెపూల దండను లాగుతూ పవన్ ఆమె వైపే తదేకంగా చూస్తున్న దృశ్యం జనాల్ని భలేగా ఆకర్షించింది. వీళ్లిద్దరూ కలిసి ‘కొండవీటి రాజా’ సినిమాలోని నా కోక బాగుందా రీమిక్స్ సాంగ్ లో స్టెప్పులేయబోతున్న సంగతి తెలిసిందే. అసలే చిరంజీవి పాట.. పైగా దాని రీమిక్స్ లో పవన్ కళ్యాణ్.. అందులోనూ రాయ్ లక్ష్మీ స్టెప్పులు.. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవూ!