Begin typing your search above and press return to search.

PSPK27 లీక్స్.. మెగా బ్ర‌ద‌ర్ అలా చేశారేంటి?

By:  Tupaki Desk   |   17 April 2020 9:45 AM IST
PSPK27 లీక్స్.. మెగా బ్ర‌ద‌ర్ అలా చేశారేంటి?
X
వార్త‌ను దాచి ఉంచడం చాలా క‌ష్టం‌... ఓపెన్ చేసేయ‌డ‌మే‌ ఈజీ! ఏదీ దాగ‌దు!! అని చెబుతుంటారు. క్లాసిక్ డేస్ లో `ఆడాళ్ల నోట్లో ఏదీ దాగ‌దు అని అనేవారు` కానీ.. మోడ్ర‌న్ డేస్ లో ఇది మ‌గాళ్ల‌కు కూడా వ‌ర్తిస్తోంద‌నే తాజా ఉదంతాలు చెబుతున్నాయి. సోష‌ల్ మీడియా- డిజిట‌ల్ యుగంలో ఏదీ దాగ‌డం లేదు. ప్ర‌తిదీ ప‌బ్లిక్ కి ఓపెన్ అయిపోతున్నాయి. తెలిసో తెలియ‌కో అల‌వాట్లో పొర‌పాటుగానో కీల‌క స‌మాచారం లీకులిచ్చేస్తుండ‌డంతో అది కాస్తా అంత‌ర్జాలంలో వైర‌ల్ అయిపోతోంది. యూత్ లో హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఇటీవ‌లి కాలంలో మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి .. నాగ‌బాబు ఇచ్చిన లీకులు అలాంటివే.

ఓ ప‌బ్లిక్ వేదిక‌పై మెగాస్టార్ చిరంజీవి తాను న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క‌ 152వ సినిమా టైటిల్ `ఆచార్య` అంటూ నోరు జారడం సంచ‌ల‌న‌మైంది. ద‌ర్శ‌కుడు కొర‌టాల స‌హా రామ్ చ‌ర‌ణ్ ఈ లీక్ పై ఆశ్చ‌ర్యం వ్య‌క్త ప‌రిచారు. అది మెగాస్టార్ నోటి నుంచి అలా అల‌వోక‌గా లీకైపోయింది. దానిపై స‌ర్వ‌త్రా అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చగా మారింది. ఇక ఇటీవ‌లే ఈ సినిమాలో జ‌న‌తా గ్యారేజ్ లో ఎన్టీఆర్ త‌ర‌హాలో ప‌ర్యావ‌ర‌ణం అట‌వీ నిధిని కాపాడే వాడిగా క‌నిపిస్తాన‌ని.. న‌క్స‌లైట్ షేడ్ ఉంటుంద‌ని కూడా మెగాస్టార్ లీకులిచ్చేయ‌డం షాక్ కి గురి చేసింది. 152వ సినిమా ఇంకా సెట్స్ లో ఉండ‌గానే చాలా విష‌యాలు హీరో నోటి నుంచే లీకైపోవ‌డం ఆశ్చ‌ర్య‌ ప‌రిచింది.

ఇక మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సైతం ఏదీ దాచ‌కుండా త‌న యూట్యూబ్ చానెల్ ద్వారా.. అలాగే సోష‌ల్ మీడియాల ద్వారా ప్ర‌తిదీ లీక్ చేసేస్తుండ‌డం అంద‌రికీ షాక్ నిస్తోంది. ఇటీవ‌ల అభిమానుల‌తో చిట్ చాట్ లో నాగ‌బాబు య‌థాలాపంగా మైమ‌రిచిపోయి త‌న‌ సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా సినిమా టైటిల్ ని లీక్ చేసేశారు. ప‌వ‌న్ కోసం `విరూపాక్ష‌` అనే టైటిల్ ని అనుకుంటున్నార‌ని అధికారికంగానే చెప్పేశారు. ఇంకా క్రిష్ కానీ నిర్మాత ఏ.ఎం.ర‌త్నం కానీ టైటిల్ పై ఏదీ చెప్ప‌క ముందే.. చిత్ర‌బృందం అధికారిక అనౌన్స్ మెంట్ మీట్ కి ఏర్పాట్లు చేయ‌క‌ముందే.. ప‌వ‌న్ న‌టిస్తున్న 27వ సినిమా టైటిల్ ని నాగ‌బాబు అధికారికం చేసేశారు. మ‌రి దీనిపై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్రిష్‌- ఏ.ఎం.ర‌త్నం వెర్ష‌న్ ఎలా ఉండ‌నుందో చూడాలి. ఇంకా ఈ మూవీలో ప‌వ‌న్ ఒక గ‌జ‌దొంగ‌గా క‌నిపిస్తార‌ని.. ఔరంగ‌జేబ్ కాలం నాటి స్టోరీ ఇద‌ని నాగ‌బాబు లీక్ చేసేశారు. దీంతో చిరు 152 విష‌యంలో కానీ.. ప‌వ‌న్ 27 విష‌యంలో కానీ స‌స్పెన్స్ లేకుండా పోయింద‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. ఇప్ప‌టికే టైటిళ్లు స‌హా క‌థ‌.. అందులో ప్ర‌ధాన‌ పాత్ర తీరుతెన్ను‌లు ఏమిటో లీకైపోవ‌డంతో ఉత్కంఠ లేకుండా పోయింద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే మెగా బ్ర‌ద‌ర్స్ ఇచ్చే లీకులు ఆయా సినిమాల‌కు లాభం చేకూరుస్తాయా లేదా న‌ష్టాన్ని క‌లిగిస్తాయా? అన్న‌ది చిత్ర‌బృందాలే ఎన‌లైజ్ చేయాల్సి ఉంటుంది.