Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ మూవీని పక్కన పెట్టి ఆ డైరెక్టర్ మరో మూవీ చేస్తాడా..?
By: Tupaki Desk | 22 Dec 2020 10:45 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'గబ్బర్‌సింగ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గతేడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ శంకర్‌తో ఫస్ట్ కాంబినేషనే సూపర్ హిట్ కావడంతో ఆయనతో మరో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అలా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడో లేదో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే పవన్ కళ్యాణ్ వరుసగా కొత్త ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి ఈ హరీష్ శంకర్ సినిమా. ఇది పవన్ 28వ సినిమా కానుందని అంతా అనుకున్నారు. కానీ ఈ గ్యాప్ లో హరీష్ నెంబర్ మారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ నుండి మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుంది. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ తో 'విరూపాక్ష'.. ఆ పిదప ఇటీవలే లాంచ్ చేసిన మలయాళ రీమేక్ 'అయ్యప్పన్ కోషియం'. ఈ రీమేక్ సినిమాను దసరా వరకు రెడీ చేస్తారని ఇండస్ట్రీ టాక్.
అయితే మరి హరీష్ శంకర్ సినిమా ఎప్పుడు? అనేది తెలియాల్సి ఉంది. డైరెక్టర్ తో పాటు హీరో అభిమానులు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి మధ్యలో అయ్యప్పన్ కోషియం ముందుకు రావడంతో హరీష్ సినిమా ఇప్పట్లో రావడం కష్టమే అని అంటున్నాయి సినీవర్గాలు. అయితే హరీష్ మాత్రం కేవలం పవన్ సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇదివరకే పవన్ సినిమా అయ్యేవరకు వేరే సినిమా ముట్టుకోనని ట్వీట్ చేసి చెప్పాడు. అంతేగాక తను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే అని గుర్తుచేశాడు. మరి ఈ వరుస సినిమాలు పూర్తయ్యేలోపు హరీష్ మరో సినిమా ఏదైనా చేస్తాడా..? లేక పవన్ అభిమానిగా ఎదురు చూస్తాడా..? చూడాలి. ఒకవేళ హరీష్ సినిమా ఓకే అయినా అది 2022లోనే వస్తుందని అంచనా వేస్తున్నారు.