Begin typing your search above and press return to search.

`గ‌బ్బ‌ర్‌సింగ్‌`తో డీల్ ఏదీ తేల‌లేదా?

By:  Tupaki Desk   |   7 Sept 2020 12:20 PM IST
`గ‌బ్బ‌ర్‌సింగ్‌`తో డీల్ ఏదీ తేల‌లేదా?
X
ప‌వ‌ర్ ‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ - హ‌రీష్ ‌శంక‌ర్ ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `గ‌బ్బ‌ర్‌సింగ్‌` ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌ సినిమా వెంట‌నే సాధ్య‌ప‌డ‌లేదు. ఇన్నాళ్టికి ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వేళ ప‌వ‌ర్ స్టార్ ‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ప్ర‌క‌టించేశాడు. అయితే కాన్సెప్ట్ కూడా చెప్ప‌కుండా ప్రాజెక్ట్ ని లైన్ ‌లో పెట్ట‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ ‌గా మారింది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని ప‌వ‌న్ పుట్టిన రోజున రిలీజ్ చేసి సినిమాపై వున్న ఆస‌క్తిని రెట్టింపు చేశాడు హ‌రీష్ శంక‌ర్‌.

ఇదిలా ఉంటే ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ తో సినిమాని మొద‌లుపెట్టే విష‌యంలో డీల్ ఇంకా ఏదీ తేలలేద‌ని తెలిసింది. కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత `గ‌బ్బ‌ర్ సింగ్` చిత్రంతో ప‌వ‌న్ కు తిరుగులేని విజ‌యాన్ని అందించిన హ‌రీష్ ‌శంక‌ర్ తాజా మూవీ స్క్రిప్ట్ కోసం ఏకంగా 6 నెల‌లు శ్ర‌మించార‌ట‌. ఇటీవ‌లే పూర్తి డ్రాప్ట్ ని ప‌వ‌న్ కు వినిపించ‌డం తో ఆయ‌న ఫుల్ గా సంతృప్తి చెందార‌ట‌. ఎలాంటి మార్పులు చెప్ప‌న‌ట్లు తెలిసింది. దీంతో ఫైన‌ల్ స్క్రిప్ట్ ని హ‌రీష్ ‌శంక‌ర్ లాక్ చేశార‌ట‌.

ఎంత లాక్ చేసినా ఈ మూవీ ప‌ట్టాలెక్కాలంటే చాలా నెల‌లు ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి. కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన హ‌రీష్ ‌శంక‌ర్ ఈ ద‌ఫా ఎంట‌ర్ ‌టైన్ ‌మెంట్ మాత్ర‌మే కాదు.. అంత‌కు మించి సోష‌ల్ మెసేజ్ ని కూడా అందించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించడంతో ఇది ప‌వ‌న్ కు రాజ‌కీయంగా కూడా ఓ రేంజ్ లో ప‌నికొచ్చే సినిమాగా ప్ర‌చార‌మ‌వుతోంది.