Begin typing your search above and press return to search.
పవన్ - త్రివిక్రమ్ - బండ్ల గణేశ్ సినిమా ఫిక్స్ అయినట్లేనా..?
By: Tupaki Desk | 2 Jan 2021 12:45 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో ఒకరైన నటుడు నిర్మాత బండ్ల గణేష్ తన బాస్ తో సినిమా ఓకే చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇతర వివరాలు.. నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి మాత్రం బండ్ల గణేష్ వెల్లడించలేదు. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడాని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో బండ్ల గణేశ్ నుంచి త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్ అడ్వాన్సులు తీసుకున్నారని టాక్. అలానే రెమ్యూనరేషన్ తో పాటు త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ లో పార్టనర్ షిప్ కూడా తీసుకున్నాడట.
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ను వదిలే ప్రసక్తే ఉండకపోవచ్చు. అందుకే ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లేలోపు బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో పవన్ తో చేసే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఏదేమైనా పవన్ - బండ్ల గణేష్ కాంబినేషన్ లో 'గబ్బర్ సింగ్' సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో.. మళ్ళీ అదే రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బండ్ల సైతం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ పండగ చేసుకునే సినిమా తీస్తా అని చెప్తూ వస్తున్నాడు. మరి ఈ సినిమాకు పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి.