Begin typing your search above and press return to search.

పవన్ భలే హుషారు చూపిస్తున్నాడబ్బా

By:  Tupaki Desk   |   17 Oct 2016 1:30 PM GMT
పవన్ భలే హుషారు చూపిస్తున్నాడబ్బా
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అంతే.. సినిమా మొదలు పెట్టడంలో లేట్ ఉంటుందేమో కానీ.. ఒకసారి మనసుపెట్టి రంగంలోకి దిగాక అసలు బ్రేక్ తీసుకునేందుకే ఇష్టపడ్డడు. కొన్ని సార్లు రావడం లేటయినా.. రావడం మాత్రం పక్కా అంటూ సినిమాలో రియలిస్టిక్ డైలాగ్ చెప్పినట్లుగానే ఉంటుంది పవన్ తో వ్యవహారం. కాటమరాయుడు విషయంలో రకరకాల కారణాలతో లేట్ ఎదుర్కుని.. చివరకు షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్.. ఇప్పుడు సెట్స్ లో చూపిస్తున్న హుషారు చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోతోందట.

పవర్ స్టార్ అంటే పవర్ ఫుల్ ఎనర్జీకి మారుపేరు అని ఆయనతో పని చేసినోళ్లకు తెలుసు కానీ.. కొత్తగా వర్క్ చేసే వాళ్లకు మాత్రం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పైగా ఈ కాటమరాయుడు నుంచి పవన్ కొత్త లెక్కలు కూడా మొదలుపెట్టినట్లున్నాడు. గత మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ వరకూ.. పవన్ సినిమా అంటే.. అందుకు సంబంధించిన ఒక్క లుక్ కూడా బయటకొచ్చేదే కాదు. పైగా ఫోటో సెషన్ లాంటివి షూటింగ్ స్పాట్ లో అనుమతించేవారు కాదు. కానీ కాటమరాయుడుకు అలాంటి రూల్స్ ఏమీ పెట్టుకోలేదు. షూటింగ్ కి వచ్చిన ఫ్యాన్స్ నుంచి యాక్టర్స్ వరకూ ప్రతీ ఒక్కళ్లతో ఫోటో దిగేందుకు ఏ మాత్రం అభ్యంతరాలు చెప్పడం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/