Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసి.. అంతుందా?

By:  Tupaki Desk   |   20 Dec 2017 11:30 AM IST
అజ్ఞాతవాసి.. అంతుందా?
X
అజ్ఞాతవాసి సీన్ ఎంత అంటే.. ఆ సంగతి ఇప్పుడు ఊహాతీతం అనిపించేయక మానదు. యూఎస్ లో బాహుబలి2ని మించి విడుదల చేస్తున్నారంటేనే ఎక్స్ పెక్టేషన్స్ స్థాయి అర్ధమవుతుంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి మ్యానియా ముందు వేరే చిత్రాలు ఎంతవరకూ జనాల్లోకి వెళతాయనే డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి.

అయితే.. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినది మార్కెట్ సీన్ గురించి కాదు. రన్ టైం గురించి మాట్లాడుకోవాలి. త్రివిక్రమ్ సినిమాలు కాసింత లెంగ్తీగానే ఉంటాయి. ఇప్పుడు అజ్ఞతవాసి చిత్రం కూడా ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువే వచ్చిందట. ఆఖరి నిమిషంలో త్రివిక్రమ్ చేసిన వాల్యూ ఎడిషన్స్ ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎమోషన్స్ పండించడంపై బాగా శ్రద్ధ పెట్టారట. సినిమా పర్ఫెక్ట్ గా వచ్చినా.. ఇంత సుదీర్ఘమైన డ్యురేషన్ అంటే.. ఎగ్జిబిటర్లకు ఇబ్బంది. ఎక్కువ షోలు వేసుకునేందుకు అడ్డం అవుతుంది.

అయితే త్రివిక్రమ్ మాత్రం ఈ విషయంలో పట్టుదలగానే ఉన్నాడట. ఏమాత్రం రన్ టైం తగ్గించడానికి అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ 2గంటల 45 నిమిషాల నిడివితోనే ఫైనల్ కట్ ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి వన్నీ రిలీజ్ కి ముందు మాట్లాడుకునే సంగతులే కానీ.. ఒకసారి మూవీకి మంచి టాక్ వస్తే.. ఈ రన్ టైం లాంటి టాపిక్స్ గురించి డిస్కషన్స్ అవసరమే ఉండదని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయట.