Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ రాలే.. టైమేమో 11'o క్లాక్...

By:  Tupaki Desk   |   27 Nov 2017 11:02 AM IST
ఫస్ట్ లుక్ రాలే.. టైమేమో 11o క్లాక్...
X
ఇప్పుడు ట్విట్టర్ అంతా కూడా పవన్ కళ్యాణ్‌ గత రాత్రి ప్రకటించిన పికె క్రియేటివ్ వర్క్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆ హ్యాండిల్ ద్వారా పవన్ కొత్త సినిమా లుక్ అండ్ టైటిల్ ను ప్రకటిస్తాం అని తెలియజేశారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?

ఉదయం 10 గంటలకు అని చెప్పడంతో ఈ అభిమానులు అందరూ కూడా 9.30 నుండే ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ స్టార్ హీరోల విషయంలో జరిగినట్లే ఇప్పుడు మరోసారి రిపీట్ అయ్యింది. ఎంత చూసినా కూడా ఆ ఫస్ట్ లుక్ మాత్రం రాలేదు. అందుకే కొంతమంది అభిమానులు నిరాశ చెంది ట్విట్టర్లో ట్వీట్లు పెడుతుంటే.. కొందరేమో మళ్ళీ మళ్లీ ఆ పేజీని రిఫ్రెష్‌ చేస్తూ ఏకంగా ట్విట్టర్ నే షేక్ చేస్తున్నారు. కొందరైతే.. ఇదే సినిమాలో పాట ఉంది చూశారు.. 'బయటకొచ్చి చూస్తే టైమేమో 3ఓ క్లాక్' ను కాస్త మార్చి.. ''ఫస్ట్ లుక్ రాలే.. టైమేమో 11ఓ క్లాక్' అంటూ పాడుతున్నారు.

ఏదేమైనా కూడా.. ఆల్రెడీ చేతిలో ఫస్ట్ లుక్ రెడీగా పెట్టుకుని.. దానిని చెప్పిన టైముకు ట్వీట్ చేస్తే బాగుంటుంది కాని.. ఇలా ఎప్పుడూ డిలే అంటే ఎలా బాసూ? చెప్పిన తేదీలకు సినిమాలు రావు.. చెప్పిన టైముకు ఫస్ట్ లుక్ లు రిలీజ్ కావు.. కాని దేశంలో అన్నీ టైముకు జరిగపోవాలని కోరుకుంటుంటారు చాలామంది సినిమా ప్రజలు. ప్చ్ఁఁ