Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసి ఆడియో డేట్ ఇదే

By:  Tupaki Desk   |   29 Nov 2017 1:03 PM IST
అజ్ఞాతవాసి ఆడియో డేట్ ఇదే
X
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ టైటిల్ పై ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్లుగానే.. అజ్ఞాతవాసి అనే పేరునే ఫిక్స్ చేశారు. ఇటు టైటిల్ లోగోతో పాటే.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసేశారు.

జనవరి 10న అజ్ఞాతవాసి రిలీజ్ అవుతుందని పవన్ పుట్టిన రోజునే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయగా.. ఇప్పుడు సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పనులు మొదలైపోయినట్లే. కోలీవుడ్ సెన్సేషనల్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న అజ్ఞాతవాసి ఆడియోను.. డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 18.. 19 అని రెండు డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నారట యూనిట్. డిసెంబర్ 18న ఆదివారం కావడంతో.. అదే రోజున ఆడియో లాంఛ్ చేయాలని నిర్ణయించారు. అయితే.. పర్మిషన్స్ విషయంలో ఏదైనా ఆలస్యం జరిగితే.. అనే ఉద్దేశ్యంతో సేఫ్ సైడ్ గా 19వ తేదీ అని కూడా అనుకుంటున్నారట.

అజ్ఞాతవాసిలో మొత్తం 5 పాటలు ఉంటాయని తెలుస్తోంది. వీటిలో ఫుల్ మాస్ బీట్ తో సాగే సూపర్బ్ సాంగ్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ దాదాపుగా జరిగిపోయాయని అంటున్నారు. ఆడియో రైట్స్ రూపంలో కూడా భారీ మొత్తం రాబట్టిన ఈ చిత్రానికి.. రికార్డ్ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో.. ఓవర్సీస్.. శాటిలైట్.. డిజిటల్ ఫార్మాట్స్ రూపంలో కూడా భారీ మొత్తం గిట్టుబాటు కావడం ఖాయం.