Begin typing your search above and press return to search.

పవన్.. ఖుషీ సీక్వెల్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   15 Dec 2015 3:00 PM IST
పవన్.. ఖుషీ సీక్వెల్ చేస్తున్నాడా?
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది ప్రత్యేకమైన రూట్. అలాగే కోలీవుడ్ డైరెక్టర్లలో ఎస్ జే సూర్యది డిఫరెంట్ ఇమేజ్. వీళ్లిద్దరి కాంబినేషన్ అంటే ఎప్పడూ సెన్సేషనే. మొదట పవన్ - ఎస్ జే సూర్యలు కలిసి తీసి ఖుషీ.. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. పవర్ స్టార్ కి యూత్ లో ఉన్న క్రేజ్ ని పదిరెట్లు పెంచేసింది. అయితే.

ఈ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయడంలో కొమరం పులి మాత్రం ఫెయిల్ అయింది. ఇది పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజార్డర్. అయితే.. తనకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ పై పవన్ మళ్లీ నమ్మకం పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న ఈ డైరెక్టర్ కి ఓ ట్రెమండస్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు. సూర్య డైరెక్షన్ లో పవన్ సినిమా ఒకటి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే ఖుషికి సీక్వెల్ తీస్తారనే టాక్ వినిపిస్తున్నా.. ఇందులో ఏంత నిజం ఉందో క్లారిటీ లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ - ఎస్ జే సూర్యల ప్రాజెక్ట్ మాత్రం కన్ఫాం అంటున్నారు. వీలైతే సర్దార్ గబ్బర్ షూటింగ్ పూర్తి కాగానే.. దీన్ని మొదలుపెట్టే యోచనలో ఉన్నాడు పవర్ స్టార్.

ఇప్పటికే సూర్య చెప్పిన లైన్ బాగా నచ్చడంతో దీన్ని డెవలప్ చేయాలని, సినిమా చేద్దాం అని మాటిచ్చాడని తెలుస్తోంది. ఎస్ జే సూర్య సినిమా అంటే సహజంగా ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎమోషన్స్ బేస్ చేసుకుని డ్రామాలు పండిస్తాడనే పేరు ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఇరగదీసేస్తాడు. అందుకే వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోయే మూవీ.. ఖుషీతో పాటు టాలీవుడ్ రికార్డులను తిరగరాసేది అవుతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు వేసుసుకుంటున్నారు.