Begin typing your search above and press return to search.

లాయ‌ర్ సాబ్ టైటిల్ ఫైన‌ల్ కాదా?

By:  Tupaki Desk   |   6 Feb 2020 10:12 AM GMT
లాయ‌ర్ సాబ్ టైటిల్ ఫైన‌ల్ కాదా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రీఎంట్రీ మూవీ టైటిల్ `లాయ‌ర్ సాబ్` (#PSPK 26) అంటూ ఇప్ప‌టికే ప్ర‌చార‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ టైటిల్ ఫైనల్ కాద‌ని స‌మాచారం. అధికారికంగా టైటిల్ ని ప‌వ‌న్ ఇంకా ఫైన‌ల్ చేయ‌లేదు. నిర్మాత దిల్ రాజు ఒకానొక సంద‌ర్భంలో ఏదో గాలి మాట‌గా అన్న‌ది అలా ప్ర‌చార‌మైపోయింది త‌ప్ప .. ఇదీ టైటిల్ అని అధికారికంగా పీఎస్ పీకే 26 టీమ్ ప్ర‌క‌టించ‌లేదు.

ప్ర‌స్తుతం దిల్ రాజు బృందం టైటిల్ పై సీరియ‌స్ గానే క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలిసింది. ప‌వ‌న్ రీఎంట్రీ మూవీ కావ‌డంతో పింక్ రీమేక్ టైటిల్ ఎంతో క్యాచీగా ఉండాల‌ని భావిస్తున్నార‌ట‌. లాయ‌ర్ సాబ్ అన్న టైటిల్ సింపుల్ గా ఉన్నా కానీ.. ఏదో తేడా కొడుతోంది. దానికంటే `వ‌కీల్ సాబ్` అన్న టైటిల్ బావుంటుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. ఈ టైటిల్ నే ప‌వ‌న్ కి వినిపించి ఓకే చేయించుకునే అవ‌కాశం ఉంద‌ని క్లోజ్ సోర్స్ నుంచి రివీలైంది. టైటిల్ ని ఉగాది కానుక‌గా మార్చి 25న ప్ర‌కటించ‌నున్నారు.

ఇప్ప‌టికే పీకే సినిమా స‌మ్మ‌ర్ రిలీజ్ కి తేదీ ఫిక్స‌యిన సంగ‌తి తెలిసిందే. మే 15న రిలీజ్ చేయ‌డ‌మే ధ్యేయంగా ఎలాంటి గ్యాప్స్ తీసుకోకుండా కంటిన్యూ షెడ్యూల్ లో తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఈ సినిమా కోసం గ్యాప్ లేకుండా ఆన్ సెట్స్ శ్ర‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం లో దిల్ రాజు- బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.