Begin typing your search above and press return to search.

#పీకె25.. హైద్రాబాద్ టు బ్యాంకాక్..

By:  Tupaki Desk   |   31 Aug 2017 12:59 PM GMT
#పీకె25.. హైద్రాబాద్ టు బ్యాంకాక్..
X
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా.. హైద్రాబాద్ లో నిర్మించిన భారీ సెట్స్ లో ఈ షూటింగ్ ఇప్పటివరకూ కొనసాగింది. మరో రెండు రోజుల్లో పవర్ స్టార్ పుట్టిన రోజు రానుండడంతో.. పవన్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

నిజానికి సెప్టెంబర్ 2న పీకే25 ఫస్ట్ లుక్ అంటూ నిర్మాణ సంస్థ హారిక హాసినీ బ్యానర్స్ గతంలోనే ఓ పోస్టర్ ను కూడా పబ్లిష్ చేసింది. ఏం జరిగింతో తెలీదు కానీ ఈ పోస్టర్ ను ఆ తర్వాత తొలగించారు. అయితే ఫస్ట్ లుక్ లాంఛ్ పై ఇంకా సందిగ్ధత కంటిన్యూ అవుతోన్నా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ లోని పలు కీలక ప్రాంతాల్లో షూటింగ్ చేయనుండగా.. పలు రోడ్లపై పవన్-కీర్తి సురేష్ లు పాల్గొంటున్న సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ ప్రారంభంలోనే బ్యాంకాక్ చేరుకోనున్నారట పవన్ అండ్ టీం.

ఈ షెడ్యూల్ చాలా వేగంగా పూర్తి కానుండగా.. ఆ తర్వాత సుదీర్ఘమైన షెడ్యూల్ కోసం యూరోప్ చేరుకున్నారు. అక్కడ నెల రోజులకు పైగా షూటింగ్ చేస్తారని.. పలు ప్రధాన సన్నివేశాలతో పాటు.. పాటలు.. కొన్ని యాక్షన్ దృశ్యాలను కూడా పిక్చరైజ్ చేస్తారట. యూరోప్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవుతుందనే టాక్ వినిపిస్తోంది.