Begin typing your search above and press return to search.

పవన్ ఒక ''అజ్ఞాతవాసి''??

By:  Tupaki Desk   |   2 Sep 2017 8:52 AM GMT
పవన్ ఒక అజ్ఞాతవాసి??
X
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బోలెడన్ని అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. పవన్ స్వయంగా అర డజన్ పైగా ట్వీట్స్ పెట్టి.. అభిమానులతో సంతోషం పంచుకోగా.. మెగాస్టార్-పవర్ స్టార్ కలిసిన ఫోటో.. పవన్ షూటింగ్ స్పాట్ లో చిరంజీవి.. ఆయన భార్య సురేఖ కనిపించడం.. ఇలా రకరకాల కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న మూవీ అప్ డేట్స్ కూడా కొన్ని తెలియచేశారు.

ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. మరోవైపు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వయంగా పాడుతున్న ఈ పాటకు సంబంధించిన సాంగ్ ప్రోమో కూడా విడుదల చేశారు. అయితే.. PK25గా ప్రచారం పొందుతున్న ఈ సినిమా టైటిల్ ఏంటనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. జనవరి 10న రిలీజ్ అని చెప్పారు కానీ.. టైటిల్ మాత్రం చెప్పలేదు. అయితే.. ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను పరిశీలిస్తే.. టైటిల్ పై ఓ స్పష్టత వచ్చేయచ్చు. దీర్ఘంగా ఆలోచిస్తున్న పవన్ ఫోటోతో పాటు.. నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా నడిచి వెళుతున్నట్లుగా ఈ కాన్సెప్ట్ పోస్టర్ కనిపిస్తుంది.

తెలుగు భాషపై పట్టు ఉన్న వారికి.. ఈ పోస్టర్ చూడగానే అజ్ఞాతవాసం అనే కాన్సెప్ట్ గుర్తుకు రావడంలో తప్పేమీ లేదు. పవన్ 25వ సినిమా టైటిల్ కూడా "అజ్ఞాతవాసి" అనే నిర్ణయించారన్నది లేటెస్ట్ గా వినిపిస్తున్న గుసగుస. ఓ స్టార్ హీరో మూవీకి ఇంత లోతైన టైటిల్ అంటే.. ఆశ్చర్యం వేయాల్సిందే.