Begin typing your search above and press return to search.

పవన్ ఓపెన్.. మరి మిగితావాళ్లో?

By:  Tupaki Desk   |   2 Sep 2017 5:57 AM GMT
పవన్ ఓపెన్.. మరి మిగితావాళ్లో?
X
ప్రతీ పండుగకు ఇంట్లో వేడుకల సంగతేమో కానీ.. థియేటర్లలో మాత్రం హంగామా పీక్ స్టేజ్ కి వెళ్లిపోతోంది. దగ్గరలో ఉన్న పండుగలు ఫుల్ అయిపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ 4-5 నెలలకు ముందే బెర్తులు కన్ఫాం చేసుకుంటూ.. రిలీజ్ డేట్స్ ను చెప్పేస్తున్నారు.

దసరా పండక్కి ఎన్టీఆర్ జై లవ కుశ.. మహేష్ స్పైడర్ పోటీ పడుతుంటే.. నేను కూడా మహానుభావుడినే అంటున్నా శర్వా. దీపావళికి నాగార్జున్.. రవితేజ.. గోపీచంద్ లు రేసులో నిలిచారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ పై పవన్ పంజా విసిరేశాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ స్పెషల్ మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు నిర్మాతలు. ఈ సాంగ్ చివరలో పవన్-త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. 2018 జనవరి 10న.. హారిక అండ్ హాసినీ బ్యానర్ లో రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.4 విడుదల కానుందనే విషయం ఇప్పుడు ఖాయమైపోయింది. ఇంకా నాలుగు నెలలకు పైగా సమయం ఉండడం.. ఇప్పటికి నాలుగు నెలలుగా షూటింగ్ చేస్తుండడంతో.. ఈడేట్ వాయిదా పడే ఛాన్సే లేదు. అయితే.. సంక్రాంతికి వస్తున్నామంటూ మరికొన్ని సినిమాలకు చెందిన మేకర్స్ ఇప్పటికే చెప్పారు.

మహేష్ బాబు -కొరటాల శివ మూవీ భరత్ అను నేను.. రామ్ చరణ్- సుకుమార్ మూవీ రంగస్థలం1985 తోపాటు.. బాలయ్య-కేఎస్ రవికుమార్ ల కాంబినేషన్ లో రూపొందే మూవీ కూడా సంక్రాంతినే టార్గెట్ చేశాయి. అయితే.. వీటిలో దేనికీ రిలీజ్ డేట్ ఇవ్వలేదు కానీ.. సంక్రాంతికి మాత్రం పక్కా అంటున్నారు. వీటిలో రామ్ చరణ్ రంగస్థలం వెనక్కు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. బయ్యర్లను దృష్టిలో ఉంచుకుని ఓ వారం గ్యాప్ మెయింటెయిన్ చేయచ్చని.. పవన్ జనవరి 10నే(బుధవారం) వస్తున్నాడు కాబట్టి.. ఓ వారం గ్యాప్ చూసుకుని ఇతర సినిమా డేట్స్ ఇవ్వచ్చని అంటున్నారు.