Begin typing your search above and press return to search.

పీకే25 పోస్టర్‌ ఎందుకు పీకేశారో

By:  Tupaki Desk   |   25 Aug 2017 11:46 AM GMT
పీకే25 పోస్టర్‌ ఎందుకు పీకేశారో
X
పవన్ కళ్యాణ్ విషయంలో ఏ చిన్న అప్ డేట్ అయినా సరే వైరల్ అయిపోతుంది. పవన్ సినిమాలు అంటే జనాలకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పడానికి.. ఆ అప్డేట్స్ పాకే తీరు అద్దం పడుతుంది. సర్దార్ గబ్బర్ సింగ్ లుక్ అంటూ.. జస్ట్ గుర్రంతో నడుచుకుంటూ వస్తున్న పవన్ ను చూసి.. ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. కేవలం టీజర్ తో కాటమరాయుడు ఎంత మాయ చేసేసిందో చూశాం కూడా.

ఇప్పుడు పీకే25 పోస్టర్ ఒకటి అంతకు మించి హల్ చల్ చేస్తోంది. హారిక అండ్ హాసినీ బ్యానర్ వాళ్లు స్వయంగా తమ పేజ్ లో ఈ ఫోటోను పోస్ట్ చేశారు. అలాగని ఇదేమీ ఫస్ట్ లుక్ కాదు. జస్ట్ ఫస్ట్ లుక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే పోస్టర్ మాత్రమే. ఇందులో ఓ కళ్లజోడు మాత్రం కనిపిస్తుండగా.. సెప్టెంబర్ 2న పీఎస్ పీకే25 ఫస్ట్ లుక్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఇలా పోస్టర్ విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే ఇది ట్రెండింగ్ అయిపోయింది. తెగ షేరింగ్ అయిపోయి వైరల్ గా మారిపోయింది. అంతా బాగానే ఉంది కానీ.. ఇంతలో ఏమైందో ఆ పోస్టర్ ను తొలగించేశారు హారిక హాసిన బ్యానర్ వాళ్లు.

ఇలా పోస్టర్ ను రిమూవ్ చేయడం వెనక రీజన్ ఏంటనే సంగతి తెలియలేదు. కానీ ఒక సారి నెట్ లోకి వచ్చిన పోస్టర్.. నిమిషాల వ్యవధిలోనే చాలా సార్లు షేర్ అయిపోయింది. దీంతో ఈ పోస్టర్ నెట్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇంతకీ ఇలా పోస్టర్ ను ఎందుకు పీకేయాల్సి వచ్చిందో.. నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు. అయితే.. పవన్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 2న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తోంది.