Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ - హ‌రీష్ మూవీ.. స్టోరీపై క్రేజీ అప్డేట్‌!

By:  Tupaki Desk   |   25 Jun 2021 11:00 PM IST
ప‌వ‌న్ - హ‌రీష్ మూవీ.. స్టోరీపై క్రేజీ అప్డేట్‌!
X
ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ పై ప‌వ‌ర్ స్టార్ అభిమానులకు ప్ర‌త్యేక‌మైన అభిమానం ఉంటుంది. వ‌రుస‌గా ఒక‌టీ రెండు కాదు.. ఏకంగా ప‌దేళ్ల‌పాటు విజ‌యం ఎరుగ‌ని ప‌వ‌న్‌.. గ‌బ్బ‌ర్ సింగ్ తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు. అందుకే.. హ‌రీష్ పై అంత‌గా ప్రేమ‌ను చూపిస్తుంటారు. ఈ కాంబో రిపీట్ కాబోతోంద‌ని అనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర్నుంచి.. ఫ్యాన్స్ అంచ‌నాలు వేసుకోవ‌డం మొద‌లు పెట్టారు.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'హరిహర వీరమల్లు'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ సైతం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ సినిమా మొద‌లవుతుంది. అయితే.. ఎలాంటి క‌థ‌తో ఈ సినిమా రూపొంద‌నుంద‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. గ‌బ్బ‌ర్ సింగ్ వంటి హిట్ ఇచ్చిన హ‌రీశ్‌.. ప‌వ‌న్ ను ఎలా చూపించ‌బోతున్నాడ‌ని ఫ్యాన్స్ ఎగ్జ‌యిట్ అవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో.. స్టోరీకి సంబంధించి ఓ కీల‌క అప్డేట్ వినిపిస్తోంది.

వాస్త‌వానికి ఈ సినిమా స్టోరీ లైన్ ఏంట‌న్నది గ‌తంలోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ లైట్ గా రివీల్ చేశారు. ఓ నేష‌న‌ల్ వెబ్ సైట్ కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో.. ఈ సినిమా సూప‌ర్ డూపర్ స్క్రిప్టుతో తెర‌కెక్క‌బోతోంద‌ని, అభిమానుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని చెప్పిన‌ డీఎస్పీ.. తాను కూడా ఎదురు చూస్తున్న‌ట్టు చెప్పారు.

అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ ప‌నులు కూడా మొద‌లు పెట్టాన‌ని, ఇప్ప‌టికే రెండు పాట‌ల కంపోజింగ్ కూడా కంప్లీట్ అయ్యింద‌ని చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యం ఆ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఫుల్ ట్రెండ్‌ అయ్యింది. #PSPK28 అనే హ్యాష్ ట్యాగ్ ను ఇండియా వైడ్ గా ట్రెండ్స్ లో ఉంచారు.

అయితే.. ఇప్పుడు మ‌రో క‌థ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాకు సంబంధించి క‌థ విష‌యంలో ప‌వర్ స్టార్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నార‌న్న‌ది ఆ వార్త సారాంశం. అంటే.. ప‌వ‌న్ - హ‌రీష్ కాంబోలో స్టోరీ ఫైన‌ల్ అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి, డీఎస్పీ చెప్పిన స్టోరీ ఇదేనా? లేదా.. మ‌రో స్టోరీనా అన్న‌ది తెలియాల్సి ఉంది. అదే స‌మ‌యంలో.. ఇందులో నిజం ఎంత‌ అన్న‌ది తెలియాలంటే.. మ‌రికొన్ని రోజులు ప‌ట్టేలా ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.