Begin typing your search above and press return to search.

#నిహారిక పెళ్లి.. ఆద్యంతం క‌ళ్ల‌న్నీ ఆ ఇద్ద‌రిపైనే

By:  Tupaki Desk   |   9 Dec 2020 10:30 AM IST
#నిహారిక పెళ్లి.. ఆద్యంతం క‌ళ్ల‌న్నీ ఆ ఇద్ద‌రిపైనే
X
రాజ‌స్థాన్ ఉదయ్ పూర్ ‌లో నిహారిక-చైత‌న్య జంట‌ వివాహానికి పూర్వ వేడుకల్లో మొత్తం మెగా కుటుంబం ఇప్పటికే పాల్గొంటోంది. వ‌ధూవ‌రుల సంగీత వేడుకల ఫోటోలు ఇప్ప‌టికే వైరల్ అయ్యాయి. మొత్తం మెగా హీరోలు అంతా ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో మెగాభిమానుల్లో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయ్యింది. ఈ వివాహంలో మెగా-అల్లు హీరోల సంద‌డి అంతా ఇంతా కాదు. అలాగే మేన‌ల్లుళ్ల‌తో ప‌వ‌న్ స‌ర‌సం కూడా ఓ ఫోటోలో హైలైట్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఉదయపూర్ వెళ్లారు. అయితే.. అతని భార్య అన్నా లెజినోవా.. వారి పిల్లలు విమానాశ్రయంలో కనిపించలేదు. ప‌వ‌న్ మొదటి భార్య రేణు కుమారుడు అకీరా నంద‌న్.. కుమార్తె ఆద్య క‌నిపించారు. అన్నా లెజినోవా వారి పిల్ల‌లు ఈ వేడుక‌కు ఇప్ప‌టికే చేరుకున్నారా లేదా? అన్న‌ది తెలియ‌రాలేదు. నేటి సాయంత్రం నిహారిక వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.

ఇక ఇప్ప‌టికే మెహెందీ వేడుక‌కు హాజ‌రైన ప‌వ‌న్ ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ప‌వ‌న్ సింపుల్ కుర్తా లో పిల్ల‌ల‌తో క‌లిసి విమానాశ్ర‌యంలో ఫ్టైట్ వైపుగా వెళుతున్నప్ప‌టి పిక్ జ‌రంత స్పీడ్ గానే ట్రెండ్ అవుతోంది. ఇక మంగ‌ళ‌వారం రాత్రి వేడుకల్లో ఎంతో సింపుల్ గా క‌నిపిస్తున్న అకీరా-ఆద్య‌పైనే అతిథుల క‌ళ్ల‌న్నీ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వెన్యూ వ‌ద్ద నుంచి రిలీజైన మెగా హీరోల గ్రూప్ ఫోటోలో ఆరున్న‌ర అడుగుల ఒడ్డు పొడ‌వు ఉన్న‌‌ అకీరా నంద‌న్ హైలైట్ గా నిలిచారు.