Begin typing your search above and press return to search.

వకీల్‌ సాబ్‌ నాకో పెద్ద ఛాలెంజ్‌

By:  Tupaki Desk   |   6 May 2020 1:40 PM IST
వకీల్‌ సాబ్‌ నాకో పెద్ద ఛాలెంజ్‌
X
ఈ మద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాల్లో ఎక్కువ సినిమాలకు థమన్‌ సంగీతంను అందిస్తున్నాడు. చాలా స్పీడ్‌ గా ట్యూన్స్‌ ఇవ్వడంతో పాటు యూత్‌ ఆడియన్స్‌ కు కనెక్ట్‌ అయ్యేలా థమన్‌ ట్యూన్స్‌ ఇస్తాడంటూ ఇండస్ట్రీలోని ఒక వర్గం వారు అంటూ ఉంటారు. ఈ ఏడాది థమన్‌ అల వైకుంఠపురంలో చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా విజయంలో సంగీత దర్శకుడు థమన్‌ ది కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహాం లేదు. ప్రస్తుతం ఈయన పవన్‌ రీ ఎంట్రీ మూవీ వకీల్‌ సాబ్‌ కు సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆమద్య అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా మగువా మగువా అంటూ వకీల్‌ సాబ్‌ నుండి మొదటి పాట వచ్చింది. ఆ పాటకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక మిగిలిన పాటలు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా థమన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్‌ కు ఒక అభిమానిగా వకీల్‌ సాబ్‌ కు సంగీతం చేయడం నాకు పెద్ద ఛాలెంజ్‌ గా మారింది. ఫ్యాన్స్‌ కు అంచనాలు భారీగా ఉంటాయి. కనుక వారి అంచనాలను అందుకోవడం అంటే నాకు పెద్ద ఛాలెంజ్‌.

వకీల్‌ సాబ్‌ పవన్‌ నటించడం వల్లే కాకుండా ఆ స్టోరీ కూడా నా సంగీతంకు ఛాలెంజ్‌ వంటిది అన్నాడు. ఆ కథ దృష్ట్యా పాటలను ట్యూన్‌ చేయడం చాలా ఛాలెంజింగ్‌ విషయంగా థమన్‌ పేర్కొన్నాడు. పవన్‌ తో చేస్తున్న ఈ సినిమాకు మంచి సాంగ్స్‌ ఇచ్చి తన స్టార్‌ డంను మరింతగా పెంచుకోవాలని థమన్‌ భావిస్తున్నాడు. ఈ కరోనా లేకుండా ఉంటే సినిమా ఈ నెలలో విడుదల అయ్యేది. థమన్‌ వకీల్‌ సాబ్‌ ఆల్బం పూర్తిగా విడుదల అయ్యేది. వకీల్‌ సాబ్‌ ఈ ఏడాది చివరికి కాని ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు.