Begin typing your search above and press return to search.

లుక్‌ విషయంలో పవన్‌ ఫ్యాన్స్ ఆందోళన

By:  Tupaki Desk   |   5 Oct 2020 9:00 AM IST
లుక్‌ విషయంలో పవన్‌ ఫ్యాన్స్ ఆందోళన
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వరుసగా సినిమాలు చేసేందుకు కమిట్‌ అయ్యాడు. వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ తో మొదలు పెట్టి పవన్‌ వరుసగా నాలుగు సినిమాలను చేయబోతున్నాడు. వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ ను నెల రోజుల్లో పూర్తి చేసి వెంటనే క్రిష్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆ తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేయబోతున్నాడు. ఈ సినిమాల షూటింగ్స్‌ ను వచ్చే ఏడాదిలోనే పూర్తి చేయాలని పవన్‌ భావిస్తున్నాడట. భారీ అంచనాలున్న సినిమాల్లో పవన్‌ ఎలా కనిపించబోతున్నాడు అనేది ప్రస్తుతం ఆయన అభిమానులను తొలుస్తున్న ప్రశ్న.

పవన్‌ ఈ లాక్‌ డౌన్‌ టైం లో కాస్త లావు అయినట్లుగా అనిపిస్తుంది. ఆయన లుక్‌ విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనిపించడు. ఆయన వర్కౌట్స్‌ చేస్తున్నట్లుగా కనిపించడు. కారణం ఆయన పలు పనులతో బిజీ బిజీగా ఉండటమే. అందుకే ఎప్పుడు కూడా కొత్త లుక్‌ తో కనిపించేందుకు బరువు తగ్గి కనిపించాలనే ప్రయత్నాలను చేయలేదు. పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు కూడా లుక్‌ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు శ్రద తీసుకున్న సందర్బాలు లేవు. సహజంగా నటించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు కూడా పవన్‌ కళ్యాణ్‌ అదే లుక్‌ తో కనిపించబోతున్నాడు. ఈమద్య కాలంలో ఆయన్ను రెగ్యులర్‌ గా మీడియాలో చూస్తున్నాం. కాస్త లావు అయినట్లుగా అనిపిస్తున్నారు. అదే ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ కు ఆందోళన కలిగిస్తుంది.