Begin typing your search above and press return to search.

మహేష్‌, బాలయ్య ఫ్యాన్స్ కు తామేం తక్కువ కాదని నిరూపించిన పవన్ ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   18 Nov 2022 8:59 AM IST
మహేష్‌, బాలయ్య ఫ్యాన్స్ కు తామేం తక్కువ కాదని నిరూపించిన పవన్ ఫ్యాన్స్‌
X
ఆ మధ్య మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ను రీ రిలీజ్ చేసి భారీ గా కలెక్షన్స్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఫ్యాన్స్ స్వయంగా పోరికి సినిమా ను రీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో కోటి రూపాయలను మహేష్ బాబు ఛారిటీ సంస్థకు విరాళం గా ఇచ్చిన విషయం తెల్సిందే. మహేష్ బాబు ఫ్యాన్స్ యొక్క గొప్ప మనసును అంతా కూడా అభినందించారు.

బాలకృష్ణ సినిమా రీ రిలీజ్ సందర్భంగా కూడా భారీ గా కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఆ సినిమా రీ రిలీజ్ తో వచ్చిన డబ్బును నిర్మాత మరియు ఫ్యాన్స్ బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ అభిమానుల వంతు వచ్చింది.

పవన్ కళ్యాణ్ జల్సా సినిమాను ఇటీవల రీ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా తో వచ్చిన కలెక్షన్స్ ను పవన్ కి అభిమానులు నాగబాబు సమక్షంలో అందజేశారు.

కోటి రూపాయలను పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ యొక్క పార్టీ ఫండ్ అన్నట్లుగా విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

నాగబాబు స్వయంగా అభిమానులను పవన్‌ కళ్యాణ్ వద్దకు తీసుకు వెళ్లి పరిచయం చేసి వారితోనే పవన్ కళ్యాణ్ కు విరాళం ఇప్పించడం జరిగింది. అభిమానుల యొక్క విరాళంకు పవన్ కళ్యాణ్‌ అభినందనలు తెలియజేయడం జరిగింది.

మరో వైపు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. రామోజీ ఫిల్మ్‌ సిటీ లో వేసిన భారీ సెట్టింగ్‌ లో పవన్ కళ్యాణ్‌ తో పాటు కీలకమైన నటీ నటులతో దర్శకుడు క్రిష్‌ చిత్రీకరణ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.