Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్స్ చుక్కలు చూపించేస్తున్నారు

By:  Tupaki Desk   |   27 April 2021 5:00 PM IST
పవన్ ఫ్యాన్స్ చుక్కలు చూపించేస్తున్నారు
X
ఒక్క ట్వీట్ అడ్డం పెట్టి పవన్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు. ఆ ట్వీట్ ఇప్పుడు పీవీపిని సోషల్ మీడియాలో పెద్ద విలన్ గా చూపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆయన ఒక్కసారిగా పెద్ద శత్రువుగా మారారు. పవన్ నే అంటావా అంటూ వార్నింగ్ లు, తిట్లు, గతాలు తవ్వటాలు ఒకటేమిటి అన్నీ జరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు కత్తి మహేష్,శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ లు మాత్రమే పవన్ ఫ్యాన్స్ శత్రువులుగా ఉండేవారు. ఇప్పుడు కొత్తగా పీవిపి పనిమాలా వచ్చి ఆ లిస్ట్ లో చేరాడు. దాంతో పివీపిని సోషల్ మీడియా వేదికగా ఆడేసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. అసలు ఏం జరిగిందో చాలా మంది ఫ్యాన్స్ కు తెలుసు. కానీ తెలియని వాళ్ల కోసం మరోసారి గుర్తు చేసుకుందాం.

రీసెంట్ గా ముంబైలో ఒక రైల్వే స్టేషన్ పట్టాలపై పడిన పిల్లాడ్ని రక్షించి హీరో అయిన వ్యక్తిని చూపించే వీడియో వైరల్ అయ్యింది.దాన్ని ప్రముఖ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త సోషల్ మీడియాలో షేర్ చేసారు.అంతేకాకుండా ఎవరో ఏమిటో అని డైరక్ట్ గా చెప్పకుండా.. ఒక సస్పిషియస్ కామెంట్ పెట్టి వదిలారు. అంత సాహసం చేసిన ఆ వ్యక్తికి జావా బైక్ గిఫ్టుగా ఇచ్చారేంటి… లంగా డ్యాన్సులేసే హీరోలకు మాత్రం 50 కోట్లిస్తారా? అనేది పీవీపీ పెట్టిన క్యాప్షన్.

రీసెంట్ గా వకీల్ సాబ్ మూవీకి పవన్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ రూమర్ కీ, ఈ కామెంట్ కీ లంకె పెట్టి.. రచ్చ మొదలైంది. అది కాసేపటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దాంతో చాలా మంది అది పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే అని అర్దం చేసుకున్నారు. అంతే పీవీపిపై కామెంట్ల వర్షం కురిసింది. ఆ వర్షం తుఫాన్ గా మారింది. ఇప్పుడు సునామిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ స్దాయిలో కామెంట్ల రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి.

సినిమా మీద బతుకుతూ సినిమా వాళ్లనే అవహేళన చేస్తావా అంటూ పవన్ ఫ్యాన్స్ కొందరు నెట్టింట్లో డైరెక్ట్ గానే పీవీపీ కి రిటార్ట్ ఇవ్వడం మొదలైంది. దానికి తోడు గతంలో జనసేన ప్రారంభం రోజుల్లో పవన్ వెంటే తిరిగిన పీవీపీ.. ఆ తర్వాత దూరంగా వుంటున్నారు. ఈ క్రమంలోనే పీవీపీ వర్సెస్ పవన్ అనే ఈ ఎపిసోడ్ మీడియాలో హైలెట్ అవుతోంది.