Begin typing your search above and press return to search.
భీమ్ మిస్ అయిన రికార్డ్ కోసం వకీల్ సాబ్ ప్రయత్నం!
By: Tupaki Desk | 23 Oct 2020 11:00 PM ISTఈమద్య కాలంలో యూట్యూబ్ మరియు సోషల్ మీడియాల్లో స్టార్ హీరోల ఫ్యాన్స్ రికార్డుల వేటలో పడ్డారు. ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ రికార్డులు మరియు యూట్యూబ్ లో వ్యూస్ మరియు లైక్స్ రికార్డు కోసం స్టార్ హీరోల ఫ్యాన్స్ చాలా కష్టపడుతున్నారు. తమ హీరోలకు తిరుగులేని రికార్డులను తెచ్చి పెట్టాలనే ఉద్దేశ్యంతో బాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డులను తెచ్చి పెడుతున్నారు. ఏకంగా మన తెలుగు హీరోల ఫ్యాన్స్ ప్రపంచ రికార్డులను కూడా నమోదు చేస్తున్నారు. ఇంతటి రికార్డులు నమోదు చేసుకున్న ఫ్యాన్స్ వారి రికార్డుల వేట మాత్రం ఆపడటం లేదు.
ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ రామరాజు ఫర్ భీమ్ వీడియోకు నందమూరి ఫ్యాన్స్ మిలియన్ లైక్స్ రికార్డును ట్రై చేశారు. 24 గంటల్లో మిలియన్ యూట్యూబ్ లైక్స్ కోసం వారు తీవ్రంగా ప్రయత్నించారు. కొద్ది తేడాలో మిస్ అయ్యింది. కేవలం 70 వేల లైక్స్ తేడాతో 24 గంటల్లో మిలియన్ లైక్స్ రికార్డును మిస్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డును పవన్ కళ్యాణ్ అభిమానులు బద్దలు కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
దసరా కానుకగా రాబోతున్న వకీల్ సాబ్ మూవీ టీజర్ కు అత్యధిక లైక్స్ ను నమోదు చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుండే ట్రెండ్ అలర్ట్ ఇచ్చారు. మిలియన్ లైక్స్ ను కేవలం 24 గంటల లోపు దక్కించుకోవడంతో పాటు వ్యూస్ పరంగా కూడా భీమ్ వీడియోను బీట్ చేయాలని భావిస్తున్నారట. మొత్తానికి వకీల్ సాబ్ ఫ్యాన్స్ గత రికార్డులను పరిశీలిస్తే వారికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు అనిపిస్తుంది. వకీల్ సాబ్ టీజర్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అంతా కూడా ఎదురు చూస్తున్నారు.