Begin typing your search above and press return to search.

పవన్‌ ఫ్యాన్స్‌ మరో రికార్డ్‌ బ్రేకింగ్‌ కు సన్నాహాు

By:  Tupaki Desk   |   29 July 2020 12:30 AM GMT
పవన్‌ ఫ్యాన్స్‌ మరో రికార్డ్‌ బ్రేకింగ్‌ కు సన్నాహాు
X
ఈమద్య కాలంలో అభిమానులు సోషల్‌ మీడియా ట్రెండ్స్‌ పై దృష్టి పెట్టారు. ఒకప్పుడు హీరోల ఫ్యాన్స్‌ వసూళ్ల లెక్కలు మరియు 50 రోజులు 100 రోజులు ఆడిన థియేటర్ల సంఖ్యను రికార్డులుగా చెప్పుకునే వారు. ఇప్పుడు డిజిటల్‌ యుగం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్స్‌ తో రికార్డులు సృష్టిస్తూ బ్రేక్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా హ్యాపీ బర్త్‌ డే ఎన్టీఆర్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ను నందమూరి ఫ్యాన్స్‌ ట్విట్టర్‌ లో అత్యధిక ట్వీట్స్‌ చేసి రికార్డు సృష్టించారు. ఆ రికార్డును పవన్‌ ఫ్యాన్స్‌ బ్రేక్‌ చేశారు. పవన్‌ అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే హ్యాష్‌ ట్యాగ్‌ రికార్డును మహేష్‌ అభిమానులు మహేష్‌ బాబు బర్త్‌ డే కామన్‌ డీపీ హ్యాష్‌ ట్యాగ్‌ తో బ్రేక్‌ చేసి సరికొత్త రికార్డును నమోదు చేశారు. కేవలం 24 గంటల్లో ఏకంగా 3.1 కోట్ల ట్వీట్స్‌ చేసిన మహేష్‌ బాబు ఫ్యాన్‌ ఆల్‌ ఇండియా రికార్డును దక్కించుకున్నారు.

మహేష్‌ ఫ్యాన్స్‌ దక్కించుకున్న ఆ రికార్డును పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ బ్రేక్‌ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఆగస్టు 15వ తారీకున పవన్‌ బర్త్‌ డే కామన్‌ డీపీని విడుదల చేయబోతున్నారు. ఆ డీపీ విడుదల చేసిన సమయంలో పోస్ట్‌ చేసే హ్యాష్‌ ట్యాగ్‌ ను రికార్డు స్థాయిలో ట్వీట్‌ చేయాలని ఇప్పటి నుండే ట్రెండ్‌ అలర్ట్‌ ను పవన్‌ ఫ్యాన్స్‌ కు చేస్తున్నారు.

ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతున్న కామన్‌ డీపీ హ్యాష్‌ ట్యాగ్‌ ను కనీసం 3.7 కోట్ల ట్వీట్స్‌ చేసి సరికొత్త రికార్డును నమోదు చేయాలని పవన్‌ ఫ్యాన్స్‌ బలంగా కోరుకుంటున్నారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ రికార్డు బ్రేక్‌ చేసిన పవన్‌ ఫ్యాన్స్‌ కు ఇది ఒక పెద్ద టాస్క్‌ గా మారింది. మరి దీన్ని వారు సాధిస్తారా అనేది చూడాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్‌ చేయాల్సిందే.