Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి మాస్ సర్ప్రైజ్ రానుందట!

By:  Tupaki Desk   |   8 April 2021 8:00 PM IST
పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి మాస్ సర్ప్రైజ్ రానుందట!
X
తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ హరీష్ శంకర్ రూట్ వేరు. మాస్ కమర్షియల్ సినిమాలు తీయడంలో హరీష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పదేళ్లక్రితం హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'గబ్బర్ సింగ్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మూవీతో హరీష్ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ అదే సినిమా తర్వాత హరీష్ మళ్లీ అలాంటి ఇండస్ట్రీ హిట్ అందుకోలేదు. చివరిగా 'గద్దలకొండ గణేష్' తీసి హిట్ అందుకున్నాడు. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ తో హరీష్ సినిమా రానున్నది విదితమే. పక్కా గబ్బర్ సింగ్ మించిన హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ కోసం మంచి మాస్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. వీరి కాంబోలో సినిమా రాబోతుందంటేనే అభిమానులలో అంచనాలు ఓ రేంజిలో నెలకొంటాయి.

నిజానికి పవన్ నుండి ఫ్యాన్స్ కోరుకునేది కూడా గబ్బర్ సింగ్ లాంటి మాస్ ఎంటర్టైనర్ మూవీనే. ఫ్యాన్స్ అంచనాలు అందుకునే విధంగా హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని టాక్. తాజా సమాచారం ప్రకారం.. మళ్లీ పదేళ్లకు అదే వేసవిలో వీరి కాంబో మూవీతో పలకరించేందుకు రంగం సిద్ధం అవుతోందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గబ్బర్ సింగ్ విడుదలైన రోజున అంటే మే 11న రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో వినోదంతో పాటు సందేశం కూడా ఉండబోతుందట. తాజాగా పవన్ తో సినిమాకు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ పూర్తి చేసాడట హరీష్. అందులో ఓ లుక్ ఫైనల్ అయ్యిందట. అయితే ఈ సినిమా జూన్ లేదా జులైలో సెట్స్ పైకి వెళ్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి సర్ప్రైజ్ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో!