Begin typing your search above and press return to search.
ఎప్పుడూ లేనంత స్పీడ్ గా దూసుకుపోతున్న పవర్ స్టార్...!
By: Tupaki Desk | 29 April 2020 8:00 AM ISTజనసేన పార్టీ అధ్యక్షునిగా ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి జీవితం ప్రజాసేవకే అంటూ 2019 ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొని సినిమాలకు దూరం అయ్యాడు. కానీ మళ్ళీ మనసు మార్చుకొని రెండేళ్ల గ్యాప్ తీసుకొని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. కెరీర్లో ఎప్పుడు లేనంత స్పీడ్ గా సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’ రీమేక్ 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు బోణీకపూర్ నిర్మిస్తున్నారు. ఇదే ఊపులో తన నెక్స్ట్ ప్రాజెక్టుని డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో చేయనున్నాడు పవన్ కళ్యాణ్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బడా ప్రొడ్యూసర్ ఏయమ్ రత్నం నిర్మిస్తున్నారు. మొఘలాయుల కాలంలో మంచి కోసం పోరాడే ఓ హిస్టారికల్ పాత్ర పవర్ స్టార్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసారని సమాచారం.
అంతేకాకుండా పవర్ స్టార్ తన కెరీర్లో 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ‘వకీల్ సాబ్’ మరియు క్రిష్ చిత్రాల షూటింగ్ పూర్తి చేసిన వెంటనే హరీష్ శంకర్ సినిమాను కూడా స్టార్ట్ చేస్తాడట. అయితే వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ మరికొన్ని చిత్రాలకు సైన్ చేసే ఆలోచనలో ఉన్నారట. వాటిలో డైరెక్టర్ కిషోర్ పార్థసారధి (డాలీ)తో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట పవన్. గతంలో పవర్ స్టార్ - డాలీ కాంబినేషన్ లో 'గోపాల గోపాల' 'కాటమరాయుడు' చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే కనుక నిజమైతే ఇది వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా అవుతుంది. మొత్తానికి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలతో బిజీగా ఉండనున్నారు. అంతేకాకుండా ఒక తమిళ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో కూడా నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.