Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కుమార్తె పెద్ద తెర ఆరంగేట్రం?

By:  Tupaki Desk   |   4 May 2021 7:54 PM IST
ప‌వ‌న్ కుమార్తె పెద్ద తెర ఆరంగేట్రం?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - రేణు దేశాయ్ జంట‌కు అకీరా నంద‌న్- ఆద్య అనే వార‌సులు ఉన్న సంగ‌తి తెలిసిందే. అకీరానంద‌న్ సినీఎంట్రీ గురించి అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. కానీ అందుకు ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని రేణు చెబుతున్నారు. మ‌రోవైపు అడివి శేష్ మేజ‌ర్ లో అత‌డు ఒక అతిథి పాత్ర‌లో మెరుస్తాడ‌న్న చ‌ర్చ కూడా సాగింది.

ఇక‌పోతే కుమార్తె ఆద్య బుల్లితెర ఆరంగేట్రం అంద‌రిలో ఉత్కంఠ పెంచుతోంది. ఇన్నాళ్లు త‌న మ‌ద‌ర్ రేణు తో క‌లిసి న‌ట‌నలో త‌న‌ స్కిల్స్ కి సంబంధించిన వీడియోల్ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది ఆద్య‌.

ఇప్పుడు ఏకంగా జీ తెలుగులో ప్రసరమవుతున్న డ్రామా జూనియర్స్ లో జ‌డ్జి రేణు దేశాయ్ ముందే త‌న న‌ట‌ప్ర‌తిభ‌ను చూపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఆద్య రాక‌తో మామ్ రేణు ఎమోష‌న‌ల్ అవుతున్నారు. `నా బెస్ట్ డాటర్` అని ఆద్యను రేణు పొగిడేయ‌గా..`బెస్ట్ మదర్` అంటూ ఆద్య కితాబిచ్చేసింది. ఈ ప్రోమో ప్ర‌స్తుతం ప‌వ‌న్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. ఫ్యాన్స్ పాజిటివ్ వ్యాఖ్య‌ల‌తో ఆద్య‌ను ప్రోత్స‌హిస్తున్నారు. అన్న‌ట్టు ప‌వ‌న్ వార‌సురాలి పెద్ద తెర ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో ఉంది. మ‌రి రేణు నుంచి ఆన్స‌ర్ రావాల్సి ఉంటుంది.

ఇక ప‌వన్ లానే సింప్లిసిటీ ని అకీరా-ఆద్య కోరుకుంటారు. డ్రెస్సింగ్ సెన్స్ న‌డువ‌డి గౌర‌వం ఇచ్చి పుచ్చుకోవ‌డం ప్ర‌తిదీ డౌన్ టు ఎర్త్ వేలోనే ఉంటుంది. ఇటీవ‌ల కాలిన‌డ‌క‌న సాధార‌ణ భ‌క్తుల్లానే రేణుతో క‌లిసి వార‌సులు దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్లడం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.