Begin typing your search above and press return to search.

అన్న‌య్య త‌ర్వాత త‌మ్ముడి బ‌ర్త్ డే స్పెష‌లేంటి?

By:  Tupaki Desk   |   26 Aug 2021 6:00 PM IST
అన్న‌య్య త‌ర్వాత త‌మ్ముడి బ‌ర్త్ డే స్పెష‌లేంటి?
X
ఇటీవ‌లి కాలంలో బ‌ర్త్ డేలు హాట్ స్పాట్ లు గా మారాయి. స్టార్ల బ‌ర్త్ డేల‌ను పురుస్క‌రించుకుని చిత్ర‌బృందాలు విషెస్ చెబుతూ పోస్ట‌ర్లు లేదా టీజ‌ర్లు ట్రైల‌ర్ల‌ను ఆవిష్క‌రిస్తున్నాయి. ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పుర‌స్క‌రించుకుని వ‌రుస‌గా సినిమాల టైటిళ్ల‌ను ప్ర‌క‌టించారు. కొత్త పోస్ట‌ర్ల‌తో బోలెడంత హంగామా సృష్టించారు. గాడ్ ఫాదర్- భోళా శంకర్ టైటిల్స్ ప్ర‌క‌ట‌న‌తో పాటు పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేశారు. ర‌క‌ర‌కాల విజువ‌ల్స్ ని విడుద‌ల చేసి క్యూరియాసిటీని పెంచారు. #చిరు 153.. #చిరు 154 .. చిరు 155 సినిమాల లైన‌ప్ పై అభిమానుల‌కు పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. బాబి సినిమాకి టైటిల్ ని ప్ర‌క‌టించాల్సి ఉంది.

ఆగ‌స్టు 22 త‌ర్వాత మ‌ళ్లీ మెగాభిమానుల్లో ఎగ్జ‌యిట్ మెంట్ పెంచే తేదీ సెప్టెంబ‌ర్ 2. ఆరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు అభిమానులు సన్నద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 2 న పవన్ తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. చిరు మాదిరిగానే పవన్ కూడా లైన్ లో నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల కోసం ద‌ర్శ‌కులంతా ఆత్రంగా వేచి చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప‌నుల‌న్నీ పూర్త‌వుతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్ ని ప‌వ‌న్ పుట్టిన‌రోజున విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ `భీమ్లా నాయక్` కి సంబంధించిన మొదటి సింగిల్ పుట్టినరోజున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన తొలి టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. రిలీజ్ కానున్న పాటపైనా భారీ అంచనాలున్నాయి. త‌దుప‌రి దర్శకుడు హరీష్ శంకర్ సినిమా లుక్ లాంచ్ ఉంటుంది. ప‌వ‌న్ పై ఫోటోషూట్ గురించి తెలిసిన‌దే. సెప్టెంబ‌ర్ 2 స్పెష‌ల్ డే కి ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేయాలని భావిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో తన ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ ఇవ్వవచ్చని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అలాగే ప‌వ‌న్ కి క‌థ వినిపించేందుకు వేణు ఉడుగుల వంటి ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిన‌దే.

మెగా బాస్ ఇప్ప‌టికే నాలుగు సినిమాల్ని లైన్ లో పెట్టి మ‌రో నాలుగు స్క్రిప్టుల్ని ఫైన‌ల్ చేసందుకు ద‌ర్శ‌కులకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని ఇంత‌కుముందు టాక్ వినిపించింది. అలాగే ప‌వ‌న్ కూడా నాలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇందులో రెండు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంటే మిగ‌తావి ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. ఇవేగాక‌.. ఇత‌ర ద‌ర్శ‌కుల స్క్రిప్టుల్ని కూడా ఆయ‌న వినేందుకు ఆస‌క్తిగా ఉన్నారని తెలిసింది. అన్న‌య్య త‌ర్వాత త‌మ్ముడి బ‌ర్త్ డే స్పెష‌ల్ ఏంటి? అని ప్ర‌శ్నించేవారికి స‌రైన అప్ డేట్స్ తో ప‌వ‌న్ ట్రీటివ్వ‌బోతున్నార‌న్న‌మాట‌.