Begin typing your search above and press return to search.

పవన్‌ బర్త్‌డే స్పెషల్‌ కేక్స్‌.. రేటు ఎంతైనా సరే!

By:  Tupaki Desk   |   1 Sept 2021 11:00 PM IST
పవన్‌ బర్త్‌డే స్పెషల్‌ కేక్స్‌.. రేటు ఎంతైనా సరే!
X
స్టార్స్ బర్త్‌ డే అంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. అది పవన్ కళ్యాణ్ బర్త్‌ డే అయితే పరిస్థితి మరో లెవల్‌ లో ఉంటుంది. పవన్ 50వ బర్త్‌ డే రేపు జరుపుకోబోతున్నాడు. మెగా అబిమానులు భారీ ఎత్తున హంగామా చేసేందుకు సిద్దంగా ఉన్నారు. వరుసగా బర్త్‌ డే ఈవెంట్స్ తో రేపు అంతా కూడా బిజీ బిజీగా గడుపబోతున్నారు. చాలా మంది అభిమానులు చాలా రకాలుగా పవన్ బర్త్‌ డే ను ప్లాన్ చేస్తున్నారు. కొందరు సమీపంలో ఉన్న థియేటర్లలో పవన్ సినిమాను స్క్రీనింగ్‌ చేయించి ఎంజాయ్‌ చేయబోతున్నారు. మరి కొందరు పవన్ కళ్యాన్ పేరుతో స్టేజ్‌ షో లు చేయిస్తున్నారు. కొందరు సేవా కార్యక్రమాలు చేయిస్తున్నారు.

ఇలా ఎంతో మంది ఎన్నో రకాల షో లు కార్యక్రమాలు చేస్తూ బిజీ అవ్వబోతున్నారు. రేపు పవన్ బర్త్‌ డే సందర్బంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో కూడా కేక్‌ కటింగ్స్ ఉండబోతున్నాయి. అభిమానుల అంచనా ప్రకారం లక్షకు పైగా కేకులు రేపు కట్‌ అవ్వబోతున్నాయి. తమ అభిమానంను చాటుకునేందుకు ఎవరికి వారు విభిన్నమైన కేక్ లను తయారు చేయిస్తున్నారు. క్రేజ్‌ ఎలా ఉందంటే ఒక నెటిజన్ సోషల్‌ మీడియాలో.. తాను పవన్ బర్త్‌ డే సందర్బంగా కేక్ ఆర్డర్ ఇచ్చేందుకు వెళ్లగా అప్పటికే 20 పవన్ బర్త్‌ డే కేక్ లు ఆర్డర్‌ ఉన్నాయని షాప్ వ్యక్తి అన్నాడు అంటూ ఈ ఫొటోను షేర్‌ చేశాడు.

పవన్ ఫొటోతో బర్త్‌ డే కేకును తయారు చేసినందుకు భారీగా రేటు చెప్పినా కూడా అభిమానులు ఏమాత్రం తగ్గడం లేదు. అయినా పర్వాలేదు కావాలంటూ ఉన్నారు. పవన్ బర్త్‌ డే కేకులకు అన్ని బేకరీల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది అంటూ అతడు ట్వీట్‌ చేశాడు. పవన్ బర్త్‌ డే అంటే మామూలుగా ఉండదు అని నిరూపించేందుకు గాను రేపు అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ అభిమానులు రేపు వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు మరియు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ తన బర్త్‌ డే ను జరుపుకుంటాడు అనేది చూడాలి.