Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ మోస్ట్ వాంటెడ్ డాన్ గా కనిపిస్తారా?

By:  Tupaki Desk   |   2 Nov 2020 9:15 AM IST
ప‌వ‌న్ మోస్ట్ వాంటెడ్ డాన్ గా కనిపిస్తారా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ `పంజా` చిత్రంలో మాసిన గడ్డంతో ర‌గ్గ్‌డ్ లుక్ ‌తో స్టైలిష్ డాన్ ‌గా క‌నిపించిన విష‌యం తెలిసిందే. అయితే అందులో పూర్తి స్థాయి డాన్ గా కాకుండా డాన్ కి స‌హ‌య‌కుడిగా క‌నిపించారు. అయితే త్వ‌ర‌లో ప‌వ‌న్ పూర్తి స్థాయి ప‌వ‌ర్ ఫుల్ డాన్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. `గ‌బ్బ‌ర్ సింగ్‌` త‌రువాత హ‌రీష్‌ శంక‌ర్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‌ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఇందు కోసం ఓ ప‌వ‌ర్ ‌ఫుల్ స‌బ్జెక్ట్ ‌ని ప‌వ‌న్ కోసం సిద్ధం చేశార‌ట‌. ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్ర‌మే ప‌వ‌న్ డాన్ గా క‌నిపిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌ర్ స్టార్ అంటేనే ప‌వ‌ర్ ఫుల్ కాప్ అని అభిమానులు భావిస్తారు. ఈసారి అందుకు భిన్నంగా డాన్ పాత్ర‌లో ‌క‌నిపించ‌నున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నార‌ట‌. దీంతో ఈ మూవీపై స‌హ‌జంగానే అంచ‌నాలు స్కై హైకి చేరుకుంటున్నాయి.

గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో చేసిన `గ‌బ్బ‌ర్ ‌సింగ్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ‌గా నిల‌వ‌డంతో తాజాగా చేయ‌బోతున్న మూవీ అంత‌కు మించి వుంటుంద‌ని ఫ్యాన్స్ అంచ‌నాలు వేస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ కు జోడీగా పూజా హెగ్డే న‌టించే అవ‌కాశం వుంద‌ని ఫిల్హ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం `వ‌కీల్ సాబ్‌` చిత్రంలో న‌టిస్తున్న ప‌వ‌న్ ఆ మూవీ పూర్త‌యిన తరువాత మ‌ధ్య‌లో `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌`ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. ఆ త‌రువాత క్రిష్ మూవీ వుంటుంది. దాని త‌రువాతే హ‌రీష్ శంక‌ర్ సినిమా మొద‌ల‌వుతుంది.