Begin typing your search above and press return to search.

లాయర్‌ సాబ్‌ లీక్‌ లతో పవన్‌ కు చిరాకు

By:  Tupaki Desk   |   25 Jan 2020 4:43 AM GMT
లాయర్‌ సాబ్‌ లీక్‌ లతో పవన్‌ కు చిరాకు
X
పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఫిల్మ్‌ కన్ఫర్మ్‌ అయ్యింది. ఇన్ని రోజులు ఊగిసలాటలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ హిందీ హిట్‌ మూవీ 'పింక్‌' తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన టెస్టు షూటింగ్‌ ను పూర్తి చేశారు. ఆ రషెష్‌ తో చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు పవన్‌ అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. అతి త్వరలోనే పూర్తి స్థాయి రెగ్యులర్‌ షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఒక్క రోజు షూట్‌ లో పాల్గొన్న పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇక పవన్‌ కళ్యాణ్‌ పారితోషికం 50 కోట్లు అని.. పవన్‌ కళ్యాణ్‌ ను ప్రత్యేక విమానంలో అమరావతి నుండి హైదరాబాద్‌ కు దిల్‌ రాజు చాలా ఖర్చు పెట్టి తిప్పుతున్నాడు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఫొటోలు వీడియోలు లీక్‌ తో పాటు పారితోషికం మరియు ఇతర వార్తలపై పవన్‌ చాలా సీరియస్‌ గా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ఒక వైపు రాజకీయంగా హీట్‌ ఉన్న సమయంలో పవన్‌ సినిమాలు చేయడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క రోజు షూట్‌ లో పాల్గొనగా జనాలు అంతా కూడా సినిమా షూటింగ్స్‌ తో బిజీ అయ్యాడు అంటూ ప్రచారం చేస్తున్నారని పవన్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడట. లొకేషన్స్‌ లోని ఫొటోలు మరియు వీడియోలు లీక్‌ అవ్వకుండా చూసుకోవాలని.. అలాగే పారితోషికం ఇతర విషయాల గురించి మీడియాలో పుకార్లు రాకుండా కూడా చూసుకోవాలంటూ దిల్‌ రాజుకు పవన్‌ సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చి మరీ చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.