Begin typing your search above and press return to search.

ఈ సినిమాకు ప‌వ‌న్ - మ‌హేష్‌ లా?

By:  Tupaki Desk   |   6 Sep 2020 4:00 AM GMT
ఈ సినిమాకు ప‌వ‌న్ - మ‌హేష్‌ లా?
X
వి.. ఓవైపు తెలుగు ప్రేక్ష‌కులు.. మ‌రోవైపు ఇండ‌స్ట్రీ జ‌నాలు.. ఇంకోవైపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూసిన సినిమా. ఓటీటీ రిలీజ్‌ల విష‌యంలో ఇండ‌స్ట్రీలో ఇదొక గేమ్ చేంజర్ అవుతుంద‌ని అంతా ఆశించారు. కానీ జ‌రిగింది వేరు. అంచ‌నాల్ని అందుకోవ‌డంలో వి ఘోరంగా విఫ‌ల‌మైంది. ఇంద్ర‌గంటి లాంటి విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడి నుంచి ఇలాంటి స‌గ‌టు రివెంజ్ డ్రామా వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. పేరుకే థ్రిల్ల‌ర్ త‌ప్ప ఇందులో ఉత్కంఠ రేపే విష‌యాలేమీ లేవు. ఎంత త‌క్కువ అంచ‌నాల‌తో చూసినా కూడా నిరాశ క‌లిగించే సినిమానే ఇది. ఇలాంటి చిత్రాన్ని నాని ఎలా ఒప్పుకున్నాడ‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అలాగే నిర్మాత దిల్ రాజు జ‌డ్జిమెంట్‌ను కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. వి క‌థను టాలీవుడ్ టాప్ స్టార్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబుల‌ను దృష్టిలో ఉంచుకుని ఇంద్రగంటి త‌యారు చేసిన‌ట్లు ఆ మధ్య ఓ వార్త బయటికి వచ్చింది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. ‘వి’లోని రెండు ముఖ్య పాత్రల్లో ఒకటి చేసిన సుధీర్ బాబు. ప‌వ‌న్, మ‌హేష్‌ల‌తో ఈ క‌థ చేస్తే ఎలా ఉంటుందో అని ‘స‌మ్మోహ‌నం’ షూటింగ్ స‌మ‌యంలో ఇంద్ర‌గంటి ‘వి’ సినిమా లైన్ చెప్పాడ‌ని.. ఆ త‌ర్వాత ఇందులో ఒక పాత్ర‌ను త‌న‌కే ఇచ్చి ఆశ్చర్యపరిచాడని సుధీర్ అప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పవన్, మహేష్‌లతో చేయాలనుకున్న కథ అంటే ‘వి’లో ఏం విశేషం ఉందో అని ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దీని గురించి కొంత చర్చ కూడా నడిచింది. ఐతే సుధీర్‌తో ఇంద్రగంటి సరదాకు ఆ మాట అన్నాడో ఏమో కానీ.. ఇప్పుడు ‘వి’ సినిమా చూశాక మాత్రం ఇలాంటి కథ పవన్, మహేష్‌లు చేయడమా అని కామెడీగా మాట్లాడుతున్నారు జనాలు. నిజానికి నాని, సుధీర్‌ల స్థాయికి కూడా ఈ కథ తగనిది. వాళ్లు ఈ కథను అంగీకరించడం కూడా ఆశ్చర్యమే. ఇదిలా ఉండగా.. వీళ్ల వ‌ద్ద‌కు రావ‌డానికి ముందు టాలీవుడ్లో వేరే హీరోల ద‌గ్గ‌రికు ‘వి’ స్క్రిప్టు వెళ్లగా వాళ్లు తిరస్కరించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.