Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ - క్రిష్ మూవీ ఫ‌స్ట్ లుక్.. టైటిల్ ప్ర‌క‌ట‌న తేదీ ఫిక్స్?

By:  Tupaki Desk   |   15 Feb 2021 7:00 AM IST
ప‌వ‌న్ - క్రిష్ మూవీ ఫ‌స్ట్ లుక్.. టైటిల్ ప్ర‌క‌ట‌న తేదీ ఫిక్స్?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓవైపు రాజ‌కీయాలు .. మ‌రోవైపు వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. ఏపీలోని పంచాయితీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులు గెలిచి స‌ర్పంచులు అవుతుండ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇదిలా ఉండగానే మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సినిమాల షెడ్యూళ్ల‌ను విడిచిపెట్ట‌కుండా పూర్తి చేయ‌నున్నార‌ని తెలిసింది. వ‌కీల్ సాబ్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తదుప‌రి క్రిష్ తో షూటింగ్ సైలెంట్ గా పూర్తి చేస్తున్నారు. ప‌నిలోప‌నిగా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ షూటింగ్ కి ప్రిప‌రేష‌న్స్ సాగించ‌డం ఆసక్తిని పెంచింది. వీటితో పాటు మ‌రో రెండు మూడు చిత్రాల‌కు ప‌వన్ సంత‌కాలు చేశారు.

స‌మ‌యం తీసుకున్నా ప్ర‌తిదీ ప్లాన్‌ ప్ర‌కారం క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పూర్తి చేస్తున్నార‌ని స‌మాచారం. వ‌కీల్ సాబ్ స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే ప‌వ‌న్ -క్రిష్ జోడీ ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ పైనా చ‌ర్చించార‌ని తాజాగా లీకులు అందుతున్నాయి.

2021 మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ భారీ పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా మార్చి 11న శివరాత్రి సందర్భంగా ఫ‌స్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్ట‌ర్ ని లాంచ్ చేస్తార‌ని .. అలాగే రిలీజ్ తేదీపైనా క్లారిటీ ఇస్తార‌ని తాజాగా ప్ర‌చార‌మ‌వుతోంది.

అయితే దీనిపై ఇంకా క్రిష్ పెద‌వి మెద‌ప‌లేదు. ఆయ‌న నుంచి క్లారిటీ వ‌స్తుంద‌ని ప‌వ‌న్ అభిమానులు వెయి‌ట్ చేస్తున్నారు. ప‌లు భాష‌ల్లో పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ కానున్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా ప‌వ‌న్ స్నేహితుడు ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.