Begin typing your search above and press return to search.

సెట్స్ లోనే పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్న జనసేన అధినేత..!

By:  Tupaki Desk   |   10 Nov 2020 11:30 PM GMT
సెట్స్ లోనే పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్న జనసేన అధినేత..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ''వకీల్ సాబ్'' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తిరిగి ప్రారంభించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన పవన్ కళ్యాణ్ కూడా తన లుక్ మార్చేసి సెట్స్ లో అడుగుపెట్టేసాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే గత ఎనిమిది నెలలుగా జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు దూరంగా ఉంటూ వచ్చిన పవన్.. ఇప్పుడు షూటింగ్ నిమిత్తం బయటకు రావడంతో అందరూ ఆయన్ని కలిసేందుకు షూటింగ్ లొకేషన్ కి వస్తున్నట్లు తెలుస్తోంది.

'వకీల్ సాబ్' సెట్స్ లోనే పవన్ జనసేన వ్యవహారాలు కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ అటు సినిమా షూటింగ్ తో పాటు ఇతర పనులు అన్నీ అక్కడి నుంచే చూసుకోవడంతో అందరూ సెట్స్ కి వస్తున్నారు. ఇటీవల పలువురు సినీ ప్రముఖులు - సన్నిహితులు - అభిమానులు - పార్టీ కార్యకర్తలు ఆయనతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం వరకూ పవన్ షూటింగ్ లో పాల్గొని.. వచ్చే నెలలో ప్రారంభమయ్యే 'వకీల్ సాబ్' చివరి షెడ్యూల్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఒక వైపు సినిమాలు మరోవైపు జనసేన పార్టీ కార్యక్రమాలను చూసుకుంటూ పవన్ బిజీగా మారాలని నిర్ణయించుకున్నప్పటికీ దీని కారణంగా షూటింగ్ డిస్టర్బ్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.