Begin typing your search above and press return to search.

వకీల్‌ సాబ్‌ తర్వాత క్రిష్‌ కు పవన్‌ 5 డేస్‌

By:  Tupaki Desk   |   10 Nov 2020 12:20 PM IST
వకీల్‌ సాబ్‌ తర్వాత క్రిష్‌ కు పవన్‌ 5 డేస్‌
X
పవన్‌ కళ్యాణ్‌ 27వ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఏడాది సమ్మర్‌ లో సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల సినిమా షూటింగ్‌ ప్రారంభం కాకుండానే అటకెక్కింది. సినిమా ఎప్పటికి ప్రారంభం అవుతుందా అంటూ ఫ్యాన్స్‌ అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యాడు. మొదట అనుకున్న ప్రకారం అయితే వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ పూర్తి కాకుండానే క్రిష్‌ మూవీలో పవన్‌ చేయాల్సి ఉంది. కాని మలయాళ మూవీ అయ్యప్పన్‌ కోషియుమ్‌ ను రీమేక్‌ చేసేందుకు పవన్‌ ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.

వకీల్‌ సాబ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం రెండు నెలల్లోనే అయ్యప్పన్ రీమేక్‌ ను పూర్తి చేసేందుకు పవన్‌ డేట్లు ఇచ్చాడు. వచ్చే ఏడాది జనవరి నెలలోనే రీమేక్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుందట. ఆ రీమేక్‌ తర్వాత క్రిష్‌ మూవీ ఉంటుందని మీడియా వర్గాల్లో టాక్‌ వినిపించింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్‌ చివర్లో అంటే అయ్యప్పన్‌ కోషియుమ్‌ రీమేక్‌ మొదలు కాకుండానే అయిదు నుండి ఏడు రోజుల పాటు క్రిష్‌ కు పవన్‌ డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. వకీల్‌ సాబ్‌ పూర్తి అయిన తర్వాత కాస్త గ్యాప్‌ ఉంటున్న కారణంగా ఆ డేట్లను క్రిష్‌ సద్వినియోగం చేసుకునేలా ప్లాన్‌ చేస్తున్నాడు. అయిదు రోజుల్లో ఒక చిన్న షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేస్తున్నాడు.

ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్‌ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు చేస్తున్న క్రిష్‌ మరో వైపు పవన్‌ తో చేయాల్సిన ఆ చిన్న షెడ్యూల్‌ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయిస్తున్నాడట. ఏది ఏమైనా కాస్త ఆలస్యం అయినా కూడా వచ్చే ఏడాదిలో పవన్‌ క్రిష్‌ ల మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అంటూ యూనిట్‌ సభ్యులు అంటున్నారు. మెఘలాయిల కాలం నాటి నేపథ్యంతో పవన్‌ ఒక దొంగగా ఈ సినిమా రూపొందబోతుంది. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించబోతుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని క్రిష్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.