Begin typing your search above and press return to search.

క్రిష్‌ మాస్టర్‌ మైండ్‌ తో పవన్‌27 షూరూ

By:  Tupaki Desk   |   13 Nov 2020 9:30 AM IST
క్రిష్‌ మాస్టర్‌ మైండ్‌ తో పవన్‌27 షూరూ
X
పవన్‌ కళ్యాణ్‌ తన 27వ సినిమా బాధ్యతలను విలక్షణ దర్శకుడు క్రిష్‌ కు అప్పగించిన విషయం తెల్సిందే. ఎఎమ్‌ రత్నం నిర్మాణంలో రూపొందబోతున్న ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది. కాని ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. క్రిష్‌ తెలివిగా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ ను పవన్‌ లేకుండానే పూర్తి చేశాడు. పవన్‌ బల్క్‌ డేట్ల కోసం ఎదురు చూడకుండా రెండు మూడు రోజులు టైం ఇచ్చినా కూడా వెంటనే ఆయన సింగిల్‌ షాట్స్‌ ను మరియు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత పవన్‌ కళ్యాణ్ కు‌ రెండు వారాల సమయం ఉండటంతో ఆ టైమ్‌ ను తనకు ఇవ్వాలంటూ క్రిష్‌ విజ్ఞప్తి చేశాడట. రెండు వారాల్లో ఏం చేస్తారు. ఒకేసారి పూర్తి చేసేందుకు ఫిబ్రవరి లేదా మార్చిలో చేద్దాం అన్నాడట. కాని క్రిష్‌ మాత్రం అప్పటి వరకు వెయిట్‌ చేయడం వృదా పవన్‌ కు వీలున్నప్పుడు సినిమాను ముగించేద్దాం అన్నట్లుగా వచ్చే నెలలో ఎన్ని రోజులు వీలు అయితే అన్ని రోజుల డేట్లను ఇవ్వమంటూ కోరాడట. అందుకు పవన్‌ కూడా ఒప్పుకోవడంతో షూటింగ్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పవన్‌ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన ఎప్పుడు డేట్లు ఇచ్చేనో అర్థం కాదు. అందుకే వీలున్నప్పుడు చేసుకు పోవడమే బెటర్‌ అన్నట్లుగా క్రిష్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసి ఇప్పటికే ఆయన లేకుండా ఒక షెడ్యూల్‌ పూర్తి చేశాడు. ఆయన్ను రంగంలోకి దించి మరో షెడ్యూల్‌ ను పూర్తి చేయబోతున్నాడు. అతి తక్కువ వర్కింగ్‌ డేస్‌ తో ఈ సినిమాను పూర్తి చేయాలని క్రిష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.