Begin typing your search above and press return to search.

పూరి కూతురు రెండు ఇన్‌‌ స్టా అకౌంట్స్‌ కన్ఫ్యూజన్‌

By:  Tupaki Desk   |   1 Sep 2020 12:30 AM GMT
పూరి కూతురు రెండు ఇన్‌‌ స్టా అకౌంట్స్‌ కన్ఫ్యూజన్‌
X
ఈమద్య కాలంలో స్టార్స్‌ తో పాటు స్టార్‌ కిడ్స్‌ కూడా ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్స్‌ ను కలిగి ఉండటం సర్వ సాదారణం అయ్యింది. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ కూతురు పవిత్ర పూరికి ఇన్‌ స్టా లో దాదాపుగా లక్ష అయిదు వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇండస్ట్రీలో లేకున్నా ఈ స్థాయి ఫాలోవర్స్‌ అంటే మాటలు కాదు. ఆమె రెగ్యులర్‌ గా ఆ అకౌంట్‌ లో పోస్ట్‌ లు పెడుతూ వస్తోంది. అయితే పవిత్ర పూరి పేరుతో మరో అకౌంట్‌ లో ఆమె చాలా యాక్టివ్‌ గా ఉండటం జరుగుతుంది. దాంతో పవిత్ర రెండు అకౌంట్స్‌ ఏంటీ ఇందులో ఏది నిజం ఏది ఫేక్‌ అంటూ ఫాలోవర్స్‌ కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.

ఆ విషయమై క్లారిటీ ఇచ్చేందుకు పవిత్ర ఒక పోస్ట్‌ పెట్టింది. అందులో రెండు అకౌంట్స్‌ నావే. అయితే మొదటి అకౌంట్‌ తో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. సెక్యూరిటీ రీజన్స్‌ కారణంగా తన మొదటి అకౌంట్‌ ను తొలగించాలనుకుంటున్నాను. అయితే అందులో ఉన్న లక్ష మంది ఫాలోవర్స్‌ ఒక్కసారిగా డిస్సపాయింట్‌ అవ్వకుండా ఉండేందుకు నా రెండవ అకౌంట్‌ ను యాక్టివేట్ చేసి ఉంచాను.

నా రెండవ అకౌంట్‌ అందరికి పరిచయం అయిన తర్వాత మొదటి అకౌంట్‌ ను డిలీట్‌ చేస్తాను అంది. ఇంతుకు పవిత్ర మొదటి అకౌంట్‌ ను ఎందుకు డిలీట్‌ చేయాలనుకుంటుంది అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఆమె చెబుతున్న కారణం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పాత అకౌంట్‌ : @Pavithra_Puri
కొత్త అకౌంట్‌ :@PavithraPuri