Begin typing your search above and press return to search.

కొత్త టైటిల్.. హలో గురూ ప్రేమ కోసమేరా

By:  Tupaki Desk   |   13 May 2016 9:30 AM GMT
కొత్త టైటిల్.. హలో గురూ ప్రేమ కోసమేరా
X
ప్రేమ ఇష్క్ కాదల్.. టైటిల్ మాత్రమే కాదు.. సినిమా కూడా వెరైటీగానే ఉంటుంది. ఐతే సినిమాను సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్ల కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ పవన్ సాధినేని అనే యువ దర్శకుడి గురించి టాలీవుడ్లో చర్చ నడిచింది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లతో పని చేయడానికి ఆసక్తి చూపించే నారా రోహిత్ కళ్లల్లో పడ్డాడు. మంచి అవకాశం దక్కించుకున్నాడు పవన్. తన రెండో ప్రయత్నంగా నారా రోహిత్.. నందిత కాంబినేషన్లో ‘సావిత్రి’ అనే మరో డిఫరెంట్ మూవీ తీశాడు. ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్.. ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి.. పాస్ మార్కులు వేయించుకున్నాడు.

ఇప్పుడిక తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు పవన్ సాధినేని. తన తొలి రెండు సినిమాల్లాగే ఈ సినిమాకు సైతం ఓ వైరైటీ టైటిల్ పెట్టాడు పవన్. ‘నిర్ణయం’ సినిమాలోని పాపులర్ పాట స్ఫూర్తితో తన కొత్త సినిమాకు ‘హలో గురూ ప్రేమ కోసమేరా..’ అనే టైటిల్ ఎంచుకున్నాడతను. ఇది ప్రతి తెలుగు ప్రేక్షకుడి నోట్లో నానిన పాట. ఆ పాట స్ఫూర్తితో పెట్టిన టైటిల్ ఈజీగా సినిమాకు హైప్ తెచ్చేస్తుందనడంలో సందేహం లేదు. తన ఫేస్ బుక్ పేజీలో జస్ట్ టైటిల్ మాత్రం ప్రకటించిన పవన్ సాధినేని.. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపాడు. టైటిల్ చూస్తుంటే ఇదో ప్రేమ కథ అని మాత్రం అర్థమవుతోంది.