Begin typing your search above and press return to search.

చ‌నిపోయిన స్నేహితుడి కుమార్తె పై స్టార్ హీరో వాత్స‌ల్యం!

By:  Tupaki Desk   |   31 May 2021 2:30 PM GMT
చ‌నిపోయిన స్నేహితుడి కుమార్తె పై స్టార్ హీరో వాత్స‌ల్యం!
X
ఆన్ లొకేష‌న్ ప‌ని చేసేప్పుడు స్టార్ల‌ ప‌రిచ‌యం అనంత‌రం వారి మ‌ధ్య స్నేహం అటుపై ఫ్యామిలీ బాండింగ్ వ‌గైరా జ‌ర్నీ అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఉంటుంది. అలాంటి స్నేహ‌మే ప్ర‌ఖ్యాత హాలీవుడ్ స్టార్లు విన్ డీజిల్- పాల్ వాక‌ర్ న‌డుమ ఉంది. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఫేమ‌స్ యాక్ష‌న్ ప్యాక్డ్ ఫ్రాంఛైజీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ సిరీస్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ దుర‌దృష్ఠ‌వ‌శాత్తూ ఊహించ‌ని ఓ ప్ర‌మాదం పాల్ వాక‌ర్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది.

ఆ త‌ర్వాత కూడా పాల్ వాక‌ర్ కుటుంబంతో విన్ డీజిల్ కుటుంబ సాన్నిహిత్యం కొన‌సాగుతోంది. ముఖ్యంగా ఆ ఇరువురు స్టార్ హీరోల‌ కుమార్తెలు ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్. అంకుల్ విన్ అంటూ పాల్ వాక‌ర్ కుమార్తె విన్ డీజిల్ ని పిలుస్తుంది. ఇక పాల్ వాక‌ర్ కుమార్తె ఎదుగుద‌ల‌ను అత‌డు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతారు. మెడో 21వ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు చెబుతూ త‌ను మా కుటుంబ స‌భ్యురాలు అని విన్ డీజిల్ ఆప్యాయ‌త‌ను క‌న‌బ‌రిచారు. ఇది నిజంగా స్టార్ల న‌డుమ‌ ఎంతో గొప్ప స్నేహ‌బంధానికి నిర్వ‌చ‌నం అని చెప్పొచ్చు.

పాల్ వాకర్ కుమార్తె మేడో.. విన్ డీజిల్ కుమార్తె హ‌నియాతో ఒక స్వీట్ ఫ్యామిలీ అంటూ షేర్ చేసుకున్న ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ త్రోబాక్ చిత్రంతో ప్రత్యేక బంధం అభిమానుల‌కు అర్థ‌మ‌వుతోంది.పాల్ వాకర్ కుమార్తె మేడో వాకర్ తన దివంగత తండ్రికి సంబంధించిన అరుదైన ఫోటోల‌ను ప‌లుమార్లు షేర్ చేయ‌గా అభిమానుల్లో వైర‌ల్ అయ్యాయి. దురదృష్టవశాత్తు వాకర్ 2013 లో కారు ప్రమాదంలో మరణించారు.