Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : ఎన్ని వివాదాలు వచ్చినా 'పఠాన్‌' బ్యూటీ మళ్లీ చూపించింది

By:  Tupaki Desk   |   9 Jan 2023 11:30 PM GMT
పిక్‌ టాక్‌ : ఎన్ని వివాదాలు వచ్చినా పఠాన్‌ బ్యూటీ మళ్లీ చూపించింది
X
బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌ హీరోగా రూపొందిన పఠాన్‌ సినిమా ఈనెల రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్‌ గా నటించింది. ఈ అమ్మడు కనిపించిన పఠాన్ పాట ఒకటి గత కొన్నాళ్లుగా వివాదాస్పదం అవుతోంది.

ఆ పాటలో బికినీ వేసుకుని.. చిత్ర విచిత్రమైన హావభావాలతో దీపిక వివాదాస్పదం అయ్యింది. బాలీవుడ్ స్టార్స్ తో పాటు ఎంతో మంది మీడియా వారు సోషల్‌ మీడియా జనాలు ఆ పాటపై మరియు దీపికా పదుకునే పై విమర్శలు చేశారు. ముందు ముందు నగ్నంగా కూడా హీరోయిన్స్ మన ఇండియన్ సినిమాల్లో కనిపిస్తారేమో అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న రచ్చ కారణంగా దీపికా పదుకునే యొక్క సన్నివేశాలు మరియు హాట్ గా ఉన్న విజువల్స్ తగ్గిస్తారని అంతా భావించారు. కానీ దీపికా యొక్క అందాల ఆరబోత ఏమాత్రం తగ్గలేదు. తాజాగా విడుదల అయిన పోస్టర్‌ లో మరోసారి దీపికా అందాల ఆరబోతతో ఆకట్టుకుంది.

రెండు చేతుల్లో రెండు గన్స్ ను పట్టుకుని బ్యాక్ అందాలను చూపిస్తూ థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోజ్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతగా వివాదం అయినా కూడా దీపికా పదుకునే ఇంకా తగ్గకుండా అందాల ఆరబోత చేయడం కొందరికి మింగుడు పడటం లేదు. ఇప్పటికే సినిమా ను బాయ్ కాట్‌ చేయాలని కొందరు పిలుపునిచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.