Begin typing your search above and press return to search.

డీజే టిల్లు నుంచి ప‌టాసు పిల్ల వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   22 Jan 2022 11:46 AM GMT
డీజే టిల్లు నుంచి ప‌టాసు పిల్ల వ‌చ్చేసింది
X
సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తున్న చిత్రం `డీజే టిల్లు`. అట్లుంట‌ది మ‌న‌తోని` అని ట్యాగ్ టైన్‌. సితార ఎంట‌ర్‌టైన్‌హెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

తెలంగాణ యువ‌కుడి క‌థ గా రూపొందుతున్న ఈమూవీలో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ డీజే టిల్లుగా న‌టిస్తున్నాడు. సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ మూవీ అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది.

ఇఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. సినిమా కొత్త పంథాలో వుంటుంద‌నే సంకేతాల్ని అందించింది. ఇక ఇటీవ‌ల విడుద‌ల చేసిన టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియో ఓ రేంజ్ లో యూట్యూబ్ ని షేక్ చేసింది.

ప్ప‌టికి 4.1 మిలియ‌న్ వ్యూస్ ని దాటి యూట్యూబ్ లో 14 వ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇదిలా వుంటే తాజాగా శ‌నివారం సాయంత్రం మ‌రో లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు.

ప‌టాసు పిల్లా ప‌టాసు పిల్లా.. అంటూ సాగే ఈ పాట‌ని యువ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ ఆల‌పించారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాట‌కు కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యాన్ని అందించారు. ఈ పాట‌లోని స‌న్నివేశాల్లో పాట‌కు త‌గ్గ‌ట్టే నేహా శెట్టి హీరో సిద్దు జొన్న‌గ‌డ్డ‌ని క‌వ్విస్తూ ప‌టాస్ పిల్ల‌లాగే క‌నిపిస్తోంది.

కొంగు చాటు అందాల‌ని చూపిస్తూ నాభి సోయ‌గాల‌తో అరాచ‌కం సృష్టిస్తోంది. న‌డుమొంపుల వ‌య్యారాల‌తో హీరోకు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

ప‌దాల‌తో, యూత్ ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌తో సాగే ఈ ఫుల్ సాంగ్ ని జ‌న‌వరి 24న రిలీజ్ చేయ‌బోతున్నారు. పాట‌ల‌తో హ‌ల్ చ‌ల్‌ చేస్తున్న `డీజే టిల్లు` రేపు థియేట‌ర్ల‌లో ఏ స్థాయిలో ర‌చ్చ చేస్తుందో చూడాలి అంటున్నారు సినీ జ‌నం. కొత్త త‌రం ప్రేమ‌క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రిన్స్‌, బ్ర‌హ్మాజీ, ప్ర‌గ‌తి, న‌ర్రా శ్రీ‌నివాస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.