Begin typing your search above and press return to search.

చిరం'జీవితం'పై కొత్త పుస్తకం

By:  Tupaki Desk   |   18 Jan 2017 4:34 PM GMT
చిరంజీవితంపై కొత్త పుస్తకం
X
మెగాస్టార్ చిరంజీవి జీవితం టాలీవుడ్ కి ఓ డిక్షనరీ లాంటిదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. సినిమా పరిశ్రమకు సంబంధం లేని చిరు.. టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి ఎదిగిన తీరుపై ఇప్పటికే చాలానే పుస్తకాలు వచ్చాయి. తాజాగా చిరంజీవి సినీ హిస్టరీపై కొత్త పుస్తకం ఒకటి విడుదలైంది.

పసుపులేటి రామారావు రచనలో.. 'మెగా చిరంజీవితం-సినీ ప్రస్థానం 150' అనే పేరుతో ఈ పుస్తకం రూపొందింది. మెగాస్టార్ తొలి సినిమా నుంచి ఆయనతో ఎంతో పరిచయం ఉన్న రామారావు.. 150 సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరిస్తూ ఈ పుస్తకాన్ని రాయడం విశేషం. తనకు తెలిసిన విషయాలు మాత్రమే కాకుండా.. సన్నిహితులు ప్రముఖుల అభిప్రాయాలను కూడా తీసుకుని ఈ పుస్తకాన్ని రచించారు రామారావు. 120 కలర్ పేజ్ లతో 220 బ్లాక్ అండ్ పేజ్ లతో ఈ పుస్తకం ఎంతో ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 సినిమాలకు సంబంధించిన ఫోటోలను ఈ పుస్తకంలో పొందుపరచడం విశేషం.

పుస్తక ముద్రణలో ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా.. మెగా చిరంజీవితం పుస్తకం రూపొందించడంపై పసుపులేటి రామారావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మెగా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే స్వయంకృషి అంటూ రాసిన కవర్ పేజ్ నుంచి ప్రతీ పేజ్ ఎంతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. ప్రతీ ఒక్కరూ చదవదగ్గ పుస్తకం అంటున్నారు రచయిత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/