Begin typing your search above and press return to search.

అంధ యువ‌తిగా న‌టిస్తున్న హాట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   11 May 2021 11:30 PM GMT
అంధ యువ‌తిగా న‌టిస్తున్న హాట్ బ్యూటీ
X
మాజీ మిస్ క‌ర్నాట‌క .. ద‌క్షిణాది న‌టి పార్వ‌తి నాయిర్ సోష‌ల్ మీడియాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఇటీవ‌లే త‌న జిమ్ కోచ్ `స‌డెన్ షాకింగ్ హ‌గ్` అంత‌ర్జాలంలో డిబేట్ కి తెర తీసింది. షాక్ కి గుర‌య్యాను అంటూనే లైట్ తీస్కున్న ఆమె నేచుర్ పై చ‌ర్చ సాగింది.

అలాగే మాల్దీవుల్లో ఈత‌కొల‌నులో ఈదుతున్న ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవ‌న్నీ వైర‌ల్ అయ్యాయి. పార్వ‌తి నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ కంటిన్యూ అవుతోంది. ఇంత‌కుముందే గాయ‌కుడు బాద్ షాతో క‌లిసి ఆన్ రోలింగ్ స్టోన్స్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ద‌ర్శ‌న‌మిచ్చిన ఈ బ్యూటీ .. మ‌ణిపాల్ నుంచి వ‌చ్చి దిల్లీలో క‌రోనా రోగుల‌కు సేవ‌లు చేస్తున్న డాక్ట‌ర్ల‌కు హ్యాట్సాఫ్ చెబుతూ ట్వీట్ చేసింది.

తాజాగా ఇన్ స్టా వేదిక‌గా మ‌రో హాట్ ఫోటోని షేర్ చేసింది. నేవీ బ్లూ టాప్ లో కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టి ప‌డేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. పార్వతి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అన్ పార్వాయిల్ లో చాలా చాలెంజింగ్ రోల్ కోసం సన్నద్ధమైంది. కబీర్ లాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌మిస్తున్న ఈ చిత్రంలో ఆమె డబుల్ రోల్ పోషిస్తోంది. ఈ ఆఫ‌ర్ మునుపెన్న‌డూ ఊహించ‌నిది. రివెంజ్ థ్రిల్లర్‌లో తన సోదరి హత్యను గుర్తించే అంధ‌ (బ్లైండ్) మహిళ పాత్రలో న‌టిస్తోంది. గణేష్ వెంకటారం ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నారు.