Begin typing your search above and press return to search.

పరుల్.. మనసునిండా కొంగొత్త ఆశల్..!

By:  Tupaki Desk   |   9 Jan 2016 5:00 AM GMT
పరుల్.. మనసునిండా కొంగొత్త ఆశల్..!
X
వెండితెరపై వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో వస్తారు అందాల ముద్దుగుమ్మలు. అది ఒక్క సినిమాతో తీరేదా..? ఇక నేటి రోజుల్లో అయితే అన్ని 'ఉడ్'ల్లోను తమ పోస్టర్ పడాలని ఉబలాటపడని వయ్యారి భామలు లేరన్నది కలియుగంలోనూ నమ్మదగ్గ నిజాల్లో ఒకటి. ప్రస్తుతం పరుల్ మనసున ఇలాంటి ఆశలే ఉన్నాయి. వివరాల్లోకెళితే...

కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో పోలీసులకు సహకరించే శ్రేయగా నటించింది పరుల్ యాదవ్. ఈ బ్యూటీ మేడ్ ఇన్ ముంబై అయినా కన్నడలో బాగా పాపులర్. ఉప్పీ - బచ్చన్ లాంటి సినిమాల్లో అక్కడి స్టార్ హీరోలయిన ఉపేంద్ర - సుదీప్ లాంటి హీరోల సరసన నటించి కన్నడ బాబులకి బాగా దగ్గరయ్యింది. రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని వీరప్పన్ సినిమాతో టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్ జనాలను దృష్టిలోనూ పడింది. తెలుగు - కన్నడ భాషల్లో విజయవంతమైన ఈ సినిమాలో పరుల్ నటన పరంగా ప్రశంసలు దక్కించుకుంది. ఇక అందాల్లోనూ అరకొర మార్కులతో సరిపెట్టలెం. దీంతో 'వీరప్పన్' అన్ని 'ఉడ్'ల్లోనూ దండిగా అవకాశాలు ఇప్పిస్తాడని కొంగొత్త ఆశలతో ఉంది పరుల్. ఎంత వరకు నిజమవుతాయో మరి..!