Begin typing your search above and press return to search.

ఒక్క వీర‌ప్ప‌న్ జీవితాన్నే మార్చేస్తాడట‌

By:  Tupaki Desk   |   28 Dec 2015 5:11 AM GMT
ఒక్క వీర‌ప్ప‌న్ జీవితాన్నే మార్చేస్తాడట‌
X
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసిన‌ట్టు.. ఒక్క వీర‌ప్ప‌న్ నా జీవితాన్నే మార్చేస్తాడ‌ని చెబుతోంది పారుల్ యాద‌వ్‌. ఈ అమ్మ‌డు ద‌శాబ్ధం కెరీర్ లో చెప్పుకోద‌గ్గ వెలుగులు విర‌జిమ్మ‌లేక‌పోయింది. ప‌దేళ్ల‌ క్రిత‌మే త‌మిళ స్టార్ హీరో ధ‌నుస్ స‌ర‌స‌న కోలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు ఇన్నేళ్ల కెరీర్‌ లో ఆశించినన్ని అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది. కెరీర్ ప‌రంగా అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి బోల్తా కొట్టిందిలే బురు బురు పిట్ట అన్న చందంగానే బండి న‌డిచింది.

అందుకే ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు..? అన్న‌ట్టే ఆ ఒక్క బ్లాక్‌ బ‌స్ట‌ర్ కోసం ఎదురు చూస్తోంది. స‌రైన టైమ్‌ లో వెత‌క‌బోయిన తీగ‌లా రామ్‌ గోపాల్ వ‌ర్మ త‌గిలాడు. అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో కిల్లింగ్ వీర‌ప్ప‌న్ లాంటి హైలీ ఎమోష‌న‌ల్ బ్యాక్‌ డ్రాప్ స్టోరీలో న‌టించ‌గ‌లిగింది. ఈ మూవీతో అటు కోలీవుడ్‌ లో, ఇటు ఇత‌ర‌త్రా భాష‌ల్లో బిజీ అయిపోతాన‌ని న‌మ్మ‌కంగా చెబుతోంది అమ్మ‌డు.

ప్ర‌స్తుతం స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ క్లైమాక్స్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన‌ కిల్లింగ్ వీర‌ప్ప‌న్ ఇటు సౌత్‌, అటు నార్త్ జ‌నాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వ‌ర్మ ఎనిమిదేళ్ల పాటు రీసెర్చ్ చేసి తెర‌కెక్కించిన చిత్ర‌మిది.. ఇటీవ‌లే ట్రైల‌ర్ రిలీజ‌య్యాక అంచ‌నాలు పీక్స్‌ కి చేరాయి. ముందుగా ఈ మూవీ క‌న్న‌డ‌లో రిలీజ‌వుతుంది. త‌ర్వాత తెలుగులో, త‌ర్వాత త‌మిళ్‌, హిందీలో రిలీజ‌వుతుంది. ఈ మూవీలో పారుల్ ఓ 20 ఏళ్ల పోలీస్ అధికారిగా న‌టించింది. వీర‌ప్ప‌న్‌ ని అంత‌మొందించే పోలీస్ ఆప‌రేష‌న్‌ లో పాల్గొనే తెగువ ఉన్న అమ్మాయిగా ఆక‌ట్టుకోబోతోంది. రిస్కీ క్యారెక్ట‌ర్ అయినా అద‌ర‌గొట్టేశా. ఈ మూవీతో నా జాత‌క‌మే మారిపోతుంది అంటూ న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసింది పారుల్‌