Begin typing your search above and press return to search.

అమ్మడు 'బుట్టబొమ్మ' కోసం 'బుట్ట' మొత్తం ఊపేస్తోందిగా...!

By:  Tupaki Desk   |   10 May 2020 1:30 AM GMT
అమ్మడు బుట్టబొమ్మ కోసం బుట్ట మొత్తం ఊపేస్తోందిగా...!
X
శాండల్ వుడ్ హీరోయిన్ పరుల్ యాదవ్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచితమే. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కిల్లింగ్ వీరప్పన్' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరిచిందీ భామ. 'ఉప్పీ 2' - 'బచ్చన్' లాంటి సినిమాలతో కన్నడ స్టార్ హీరోలయిన ఉపేంద్ర - కిచ్చా సుదీప్ ల సరసన నటించి శాండల్ వుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. పరుల్ ప్రస్తుతం ‘క్వీన్‌’ కన్నడ రీమేక్‌ లో ‘బటర్‌ ఫ్లై’ సినిమాలో నటించింది. పరుల్ యాదవ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో ఫోటోలను టిక్ టాక్ వీడియోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకి సెగలు పుట్టిస్తూ ఉంటుంది. మొన్నీ మధ్య 'పిల్లో ఛాలెంజ్' లో పాల్గొని అందరి దృష్టి తన మీద పడేలా చేసుకుంది. ఇప్పుడు తాజాగా మన తెలుగు సాంగ్ 'బుట్టబొమ్మ' కి స్టెప్పులేసి మరోసారి తనవైపు చూసేలా చేసుకుంది.

థమన్ స్వరపరచిన 'అల వైకుంఠపురములో’చిత్రంలోని పాటలకి ఎంతటి ఆదరణ లభించిందో మనందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని 'బుట్ట బొమ్మ' సాంగ్ ఖండాలు దాటి మరీ క్రేజ్‌ ని సంపాదించుకుంది. ఇక ఈ ‘బుట్టబొమ్మ’ సాంగ్‌ కి బాలీవుడ్ స్టార్స్ సైతం స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. రీసెంటుగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యా పిల్లలతో కలిసి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పరుల్ యాదవ్ ఈ పాటకి వెరైటీగా డ్యాన్స్ చేసి అలరించింది. టిక్‌ టాక్‌ లో ఈ పాటకు డ్యాన్స్ చేసిన ఈ భామ ఆ వీడియోని ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేసింది. ముఖ్యంగా ఈ పాటకి ఆమె వేసుకున్న డ్రస్.. బుట్ట బొమ్మలా మారిన విధానం గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చ జరుగుతోంది. దీనికి కారణం అందరూ బుట్టబొమ్మ సాంగ్ కి కాళ్లు చేతులు ఊపుతూ డ్యాన్స్ చేస్తే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఎదసొంపులను ఊపుతూ స్టెప్పులేసింది. పరుల్ వేసిన బుట్టబొమ్మ సాంగ్ ఇప్పుడు వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పరుల్ యాదవ్ పరువాలు మొత్తం కదిలేలా డాన్స్ చేసిందని.. 'బుట్టబొమ్మ'కి చేతులు తిప్పితే సరిపోతుంది.. ఇలా 'బుట్ట' మొత్తం తిప్పక్కర్లేదని.. 'హాండ్స్ ఊపాలి బాండ్స్ కాదు' అని.. 'బుట్టబొమ్మ కోసం అందరూ ఏమి ఉపుతున్నారు నువ్వేమి ఉపుతున్నావ్' అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.