Begin typing your search above and press return to search.

గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన బన్నీ హీరోయిన్

By:  Tupaki Desk   |   16 April 2023 10:30 PM IST
గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన బన్నీ హీరోయిన్
X
టాలీవుడ్ కి చాలా మంది అందాల భామలు హీరోయిన్స్ గా పరిచయం అవుతూ ఉంటారు. అయితే వారిలో కొంతమంది కెరియర్ మాత్రమే ఎక్కువ కాలం కొనసాగుతుంది. కొంత మంది బ్యూటీస్ ఇలా వచ్చి రెండు, మూడు సినిమాలు చేసేసి తరువాత కనిపించకుండా పోతారు. అలా కనుమరుగైన హీరోయిన్స్ చిత్రపరిశ్రమలో ఎక్కువ మంది అని చెప్పాలి. కమర్షియల్ హీరోయిన్స్ గా సక్సెస్ అవుతారని అనుకున్న బ్యూటీస్ కూడా అవకాశాలు లేక చివరికి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారు.

అలా టాలీవుడ్ లో కేవలం కొన్ని సినిమాలకే కనిపించకుండా పోయిన అందాల భామ షీలా కౌర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ నవదీప్ కి జోడీగా సీతాకోకచిలుక అనే సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత మంచు మనోజ్ రాజుభాయ్ సినిమాలో నటించింది. అలాగే పూరి జగన్నాథ్ నిర్మాణంలో వచ్చిన హలో ప్రేమిస్తారా సినిమాలో గ్లామర్ రోల్ లో మెరిసిపోయింది.

అయితే ఆమెకి మొదటి సక్సెస్ అందించి హీరోయిన్ గా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం అంటే అల్లు అర్జున్ పరుగు అని చెప్పాలి అందులో హీరోయిన్ గా నటించిన షీలా నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తన అమాయకమైన నటనతో సినిమాకి బలం చేకూర్చింది. ఆ మూవీ సక్సెస్ తర్వాత షీలా కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది అని అందరూ భావించారు. అలాగే అనూహ్యంగా రెండో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా నటించే ఛాన్స్ కొట్టేసింది. అదుర్స్ మూవీలో నయనతారతో పాటు ఒక హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఈ మూవీలో మోడరన్ గర్ల్ అవతారంలో మెరిసింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. తరువాత రామ్ పోతినేనికి జోడీగా మస్కా సినిమాలో హాన్సికతో కలిసి నటించింది. ఈ మూవీలో కూడా మంచి పాత్రనే లభించిన సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తరువాత కూడా షీలాకి అవకాశాలు రాలేదు. దీంతో తెలుగులో చివరిగా పరమ వీరచక్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే మధ్యలో మలయాళం, కన్నడ భాషలలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది.

హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు అయితే షీలాకి రాలేదు. చివరిగా కన్నడంలో హైపర్ అనే సినిమాలో 2018లో ఈబ్యూటీ నటించింది. ఇక 2020లో చెన్నైకి చెందిన సంతోష్ రెడ్డి అనే తెలుగు వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం షీలాకి ఒక పాప కూడా ఉంది. ఈ అమ్మడు తాజాగా భర్తతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో గుర్తుపట్టలేని విధంగా షీలా మారిపోవడం విశేషం.