Begin typing your search above and press return to search.

పరుచూరి భలే గొప్పవారండీ!!

By:  Tupaki Desk   |   23 Nov 2017 6:31 PM IST
పరుచూరి భలే గొప్పవారండీ!!
X
ఉగ్ర మూకల నుంచి విదేశీ శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే సైనికుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు. కానీ దేశంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి ఆలోచించే ఆత్మీయ మనిషి సైనికుడు ఒక్కడే. ఏ బంధం లేకపోయినా అందరు భూ మాత బిడ్డలే అందులో నేను కూడా ఉన్నానని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే భారత సైనికులకు మనం ఎంతో ఋణపడి ఉన్నాం.

అయితే వారి కష్టాన్ని మనం పంచుకోలేము. కానీ వారు బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే.. తరచు తన మాటలతో ఆకట్టుకునే రచయిత పరుచూరి గోపాలకృష్ణ రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా చెప్పిన ఒక మాట అందరిని ఆకట్టుకొంది. అంతే కాకుండా ఒక పఠాన్ కోట్ లో పాక్ ఉగ్రమూకలపై పోరాడి గాయపడిన NSG జవాన్ కనగాల శ్రీరాములుతో ఒక ఫొటో దిగి వారి ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేశారు.

'పఠాన్ కోట్ లో పాక్ ఉగ్రమూకల పై పోరాడి తీవ్రంగా గాయపడ్డ శ్రీకాకుళం జిల్లాకు చెందిన NSG జవాన్ కనగాల శ్రీరాములుగారితో సెల్ఫీ. మనిషి తనగురించి ఆలోచించుకుంటాడు జవాన్ దేశంగురించి ఆలోచిస్తాడు..జై జవాన్!.. అంటూ పరుచూరి గోపాల కృష్ణ గారు ఒక ట్వీట్ కూడా చేశారు. దీంతో ఆయన ఫాలోవర్స్ ఆ పోస్ట్ పై చాలా గొప్ప కామెంట్స్ పెడుతున్నారు.